YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రామిరెడ్డి ఫ్యామిలీలో లుకలుకలు

రామిరెడ్డి ఫ్యామిలీలో లుకలుకలు

కర్నూలు, ఆగస్టు 30, 
కాటసాని రామిరెడ్డి. బనగానపల్లి ఎమ్మెల్యే. ఇక్కడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీఆర్పీ నుంచి ఒకసారి.. 2019లో వైసీపీ నుంచి శాసనసభ్యుడయ్యారు రామిరెడ్డి. మరో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి తమ్ముడు. గతంలోనే ఇద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు వచ్చాయి. ఒకరు కాంగ్రెస్‌లో మరొకరు టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ వైసీపీలోనే కొనసాగుతున్నా.. రామిరెడ్డి కుటుంబంలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి.రామిరెడ్డి అన్న కుమారుడు కాటసాని రమాకాంత్ రెడ్డి అవుకు మండలం గుండ్ల సింగవరం సర్పంచ్ గా వున్నారు. ఈ మధ్య రమాకాంత్ రెడ్డి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టింగ్ పెట్టారు. వైసీపీ కి గుడ్ బై…. సారి సీఎం జగన్ అంటూ ఆయన కామెంట్స్‌ చేశారు. త్వరలో మరో పార్టీలో చేరేందుకు నిర్ణయించారట. త్వరలోనే మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేస్తారట. గుర్తింపు ఉన్న మరో పార్టీలో చేరితే తన వాణి బాగా వినిపించవచ్చనే నిర్ణయానికి వచ్చారట రమాకాంతరెడ్డి. కాటసాని కుటుంబంలో గొర్లగుట్ట వద్ద ఏడుగురిని ఒకేసారి హత్య చేసిన తర్వాత.. రమాకాంత్ రెడ్డి తండ్రి కాటసాని శివరామిరెడ్డి బాధ్యతలు భుజాన వేసుకొని ఫ్యాక్షన్‌ గొడవలకు బలయ్యారు. ఇపుడు తనకు రాజకీయ ఎదుగుదల లేకుండా చేశారనే అసంతృప్తిలో రమాకాంత్ రెడ్డి ఉన్నారట. కాటసాని రామిరెడ్డి ప్రస్తుతం తన కుమారుడు ఓబులరెడ్డిని ప్రోజెక్ట్ చేస్తున్నారని, ఇలాగైతే తాము ఎప్పుడు ఎదుగుతామనే అభిప్రాయంతో ఉన్నారట.కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి కూడా వైసీపీ కి గుడ్‌బై చెప్పేసారు. గతంలో మల్లికార్జున రెడ్డి తండ్రి టీడీపీలో వున్నారు. కాటసాని రామిరెడ్డి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన తరువాత మల్లికార్జున రెడ్డి ఇటొచ్చారు. చాలా కాలంగా రామిరెడ్డితో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారట. సొంత కుటుంబ సభ్యులకు ప్రయారిటీ ఇస్తూ.. తనకంటే జూనియర్లకు పదవులు కట్టబెడుతున్నారని.. అలాంటప్పుడు వైసీపీలో ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తూ వెళ్లిపోయారట. కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి , నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.రమాకాంత్ రెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యుల ద్వారా ఎమ్మెల్యే రామిరెడ్డి మంతనాలు చేస్తున్నారట. కానీ రమాకాంత్‌రెడ్డి ఒప్పుకోవడం లేదట. మొత్తానికి వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు దూరం కావడం హాట్ టాపిక్ అయింది. మరి.. పార్టీ పెద్దలు సమస్య గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపడతారో లేదో చూడాలి.

Related Posts