YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఢమాల్ టమాట

ఢమాల్ టమాట

ఓవైపు ఎండలు.. మరోవైపు అకాలవర్షాలు టమాట పంటను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు ధరలేక నష్టపోయిన టమాట రైతు, ఇప్పుడు వాతావరణ పరిస్థితులతో కుదేలవుతున్నాడు. ఎండల కారణంగా టమాట పూత, పిందె రాలిపోతున్నది. రంగుమారి, కాయలు పగిలిపోతున్నాయి. మార్కెట్కు తీసుకొచ్చిన టమాటకు వ్యాపారులు ధర తక్కువగానే చెల్లిస్తున్నారు. 30 కేజీల ట్రే సగటున రూ. 100 నుంచి రూ.150 వరకు పలుకుతున్నది. 10 కేజీల ట్రేలో రెండు కేజీల టమాట దెబ్బతింటున్నది. గంప టమాట రూ.60 నుంచి రూ. 80 పలుకడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరా పంటకు రూ.55 వేల వరకు ఖర్చు చేస్తున్న రైతులకు.. పంట ఆశాజనకంగా ఉంటే 25 టన్నుల మేర దిగుబడి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు రూ. ఆరువేలు నష్టం వాటిల్లుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్లోకి పంటను తీసుకొస్తే రవాణా చార్జీలు, ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కొందరు పెట్టుబడులను వదులుకుని టమాటను పారబోస్తున్నారు. పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకుంటే వాటిని నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని రంగారెడ్డి, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం, ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కృష్ణా తదితర జిల్లాల్లో తక్కువ నీటివసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు టమాట పంట సాగుచేశారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 6వేల హెక్టార్లలో సాగుచేశారు. చేవెళ్ల, శంకర్పల్లి, నార్సింగ్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, కొత్తూరు, యాచారం, కందుకూరు, మంచాల తదితర మండలాల్లో టమాట సాగుపై రైతులు దృష్టి సారించారు. రూ.13 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. 

Related Posts