YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీచ్ సైడ్ విల్లాను కొనుగోలు చేసిన అంబానీ

బీచ్ సైడ్ విల్లాను కొనుగోలు చేసిన అంబానీ

ముంబై, ఆగస్టు 30, 
ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్‌లో 80 మిలియన్ల డాలర్ల విలువ గల బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నగరంలోనే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఒప్పందం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు. దుబాయ్ కృత్రిమ ఐలాండ్ అయిన పామ్ జుమేరా వద్ద ఉన్న ఈ ప్రాపర్టీని అంబానీ చిన్న కుమారుడు అనంత్ కోసం ఈ సంవత్సరం ప్రారంభంలో కొనుగోలు చేశారు. ఇది ప్రైవేట్ డీల్ కాబట్టి వివరాలు బయటకు రానివ్వలేదు. ఈ బీచ్-సైడ్ మాన్షన్ పామ్ జుమేరా ఐలాండ్‌కు ఉత్తర భాగంలో ఉంది. 10 బెడ్‌రూమ్‌లు, ఒక ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్ దీంట్లో ఉన్నాయి. అయితే ఈ ప్రాపర్టీ కొనుగోలుదారులు ఎవరో చెప్పకుండానే లగ్జరీ విల్లాకు సంబంధించిన వివరాలను స్థానిక మీడియా నివేదించింది.దీర్ఘకాల “గోల్డెన్ వీసాలు” అందించడం ద్వారా, విదేశీయులకు ఇంటి యాజమాన్యంపై పరిమితులను సడలించడం ద్వారా ధనవంతులకు దుబాయ్ ఇష్టమైన మార్కెట్‌గా అభివృద్ధి చెందుతోంది. బ్రిటీష్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తన భార్య విక్టోరియా, బాలీవుడ్ మెగాస్టార్ షారుక్ ఖాన్ అంబానీకి ఇరుగుపొరుగుగా అవతరించారు. వారికి కూడా అక్కడ నివాసాలు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీకి చెందిన 93.3 బిలియన్ల డాలర్ల సంపదకు ముగ్గురు వారసులలో అనంత్ ఒకరు. 65 ఏళ్ల వయస్సు గల ముకేష్ అంబానీ ప్రపంచంలోని 11వ అత్యంత సంపన్నుడు. తన సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్‌లో విస్తరించిన వైవిధ్యీకరణ తర్వాత నెమ్మదిగా తన పిల్లలకు పగ్గాలను అప్పగిస్తున్నారు.కుటుంబం విదేశాల్లో తన రియల్ ఎస్టేట్ ఫుట్ ప్రింట్‌ను పెంచుకుంటోంది. ముకేష్ వారసులు రెండో ఇంటి కోసం పశ్చిమ దేశాల వైపు చూస్తున్నారని సమాచారం. గత సంవత్సరం రిలయన్స్ యూకేలో స్టోక్ పార్క్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి 79 మిలియన్ల డాలర్లు వెచ్చించింది. ఇందులో పెద్ద కుమారుడు ఆకాష్ కోసం జార్జియన్ కాలం నాటి భవనం ఉంది. అతను ఇటీవలే టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. అతని కవల సోదరి ఇషా న్యూయార్క్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ ప్రాపర్టీ డీల్ రహస్యంగా ఉంది. రిలయన్స్‌కు సంబంధించినన ఆఫ్‌షోర్ ఎంటిటీలో ఒకటి ఈ డీల్‌ను నిర్వహిస్తుంది. అంబానీల ప్రాథమిక నివాసం ముంబయిలోని 27 అంతస్తుల ఆకాశహర్మ్యంలో మూడు హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్, 50 సీట్ల సినిమా థియేటర్, గ్రాండ్ బాల్‌రూమ్. మ్మిది ఎలివేటర్‌లతో ఉంటుంది.

Related Posts