శ్రీవారి ఆలయం కేంద్రంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాలు బాధాకరం అన్నారు ప్రధాన అర్చకుడు కృష్ణ దీక్షితులు . తిరుమలలో ఆలయంలో పనిచేసే అర్చకులు అంతా మీడియా సమావేశం నిర్వహించారు . రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలే అన్నారు అర్చకుల బృదం సభ్యులు. స్వామి వారికీ కైంకర్యాలు ఆగమం ప్రకారమే జరుగుతున్నాయని అంటున్నారు అర్చకులు. ఏదైనా మార్పులు చెయ్యాలంటే ఆగమ సలహామండలి, అర్చకుల ఆమోదంతోనే జరుగుతాయని అంటున్నారు. శిథిలావస్థకు చేరు కోవడంతోనే పోటు మర్మతులు చేశారే తప్ప ఇంకే ఆగమాలకు విరుద్దంగా జరగలేదన్నారు. ఇందులో ఎటువంటి తప్పిదాలు లేవని కృష్ణ దీక్షితులు పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలలో ఎలాంటి అపచారం జరగలేదని అన్నారు ఖాద్రిపతి స్వాములు. ప్రతి ఓక్కరికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అన్నారు ఖాద్రిపతి. రాయల్వారి కాలం నాటి ఆభరణాలు అని టిటిడిలో ఎక్కడా నమోదు కాలేదని, మీరాశికాలంలో రమణధీక్షితులు 8 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కైంకర్యాలు నిర్వహించేవారని అన్నారు. మీరాశి రద్దు అయ్యినప్పుడు ఆభరణాలును టిటిడికి అప్పగించింది రమణ దీక్షితులు వారే అన్నారు అర్చకుడు ఖాద్రిపతి. ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు సైతం రమణదీక్షితులపై విరుచుకు పడ్డారు. వెయ్యి కాళ్ళ మండపానికి దేవాలయానికి ఎలాంటి సంభంధం లేదు అని కూల్చివేతకు అంగికరించింది రమణ దీక్షితులే అని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు అన్నారు. సౌందర్యరాజన్ కుమారుడు అర్చకుడు అవ్వవచ్చు. రమణదీక్షితులు స్థానంలో మేము రాకూడదా...? అని అన్నారు. 2013 నుంచి కోర్టు చుట్టు తిరుగుతున్నానని వేణుగోపాల్ ధీక్షితులు అన్నారు.