YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి

ముంబై, సెప్టెంబర్ 2, 
బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నవారికి శుభవార్త. వరుసగా రెండు రోజులు బంగారం ధర తగ్గుతూ వస్తోంది. గురవారం తులం బంగారం రూ. 270 తగ్గగా, శుక్రవారం ఏకంగా రూ. 540 వరకు తగ్గడం విశేషం. ఈ లెక్కన రెండు రోజల్లోనే పది గ్రాముల బంగారం పై ఏకంగా సుమారు రూ. 800 తగ్గడం గమనార్హం. పెళ్లిళ్ల సీజన్‌ లేకపోవడం, ఇప్పట్లో శుభకార్యాలు కూడా ఉండకపోవడమే బంగారం ధర తగ్గడానికి కారణాలుగా తెలుస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా.? లేదా అన్ని చూడాలి. ఇక వెండి ధరలోనూ తగ్గుదుల కనిపించింది. మరి దేశ వ్యాప్తంగా శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 46,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 46,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 50,730 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 51,380 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,550 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 50,780 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,730 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 50,730 గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,730 వద్ద కొనసాగుతోంది.
తగ్గిన వెండి ధరలు..
వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. దేశవ్యాప్తంగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే న్యూఢిల్లీలో మాత్రం వెండి ధర మాత్రం రూ. 800 పెరిగి.. రూ. 51,600 వద్ద కొనసాగుతోంది.  ఇక ముంబయిలో రూ. 51,600, తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 58,000 కాగా, బెంగళూరు రూ. 58,000 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 58,000 వద్ద కొనసాగుతోంది.

Related Posts