రాధికా కుమారస్వామి.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగిపోతోంది. నెట్టింట చాలా మంది వెదుకుతున్న పేరిదే. అంతలా ట్రెండ్ అవుతోంది ఆమె పేరు. ఎందుకు? ఎవరామె? ఆమెకు అంత ప్రత్యేకత ఏంటి? ఆమె గురించి చెప్పుకొనే ముందు.. కర్ణాటక ఎన్నికలను ఒక్కసారి రీవైండ్ చేసుకుందాం. కర్ణాటక ఎన్నికలు హాట్ టాపిక్గా నడుస్తున్న తరుణంలో మరో ఇంట్రస్టింగ్ టాపిక్ను వెతికిపట్టారు నెటిజన్లు. సస్పెన్స్ థ్రిల్లర్ను తలిపించిన కర్ణాటక ఎన్నికల్లో ఫైనల్గా సీఎం పీఠాన్ని జేడీఎస్ నేత కుమార స్వామి చేజిక్కించుకున్నారు. మే 23న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో నెటిజన్లు గూగుల్లో కుమారస్వామి పర్సనల్ ప్రొఫైల్ గురించి వెతకడం ప్రారంభించారు. ఈ వెతుకులాటలో కుమారస్వామి రెండో భార్య రాధిక అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు. బీజేపీకి ఎక్కువ సీట్లు గెలిచినా మెజారిటీ లేదు. మరోవైపేమో అతి తక్కువ సీట్లున్న జేడీఎస్కే సీఎం పగ్గాలిస్తామని కాంగ్రెస్ బంపరాఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్తో ఏ మాత్రం రేసులో లేని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ కుమారుడు హెచ్డీ కుమార స్వామి సీఎం అభ్యర్థి అవతారమెత్తేశారు. ఎన్నెన్నో ట్విస్టుల మధ్య రెండ్రోజుల్లో సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. ఆయన భార్యే ఈ రాధికా కుమారస్వామి. ఇప్పుడు ఆమె గురించే నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు మరి. మే 13 నుంచి 19 మధ్య ఆమె పేరు గూగుల్ ట్రెండ్స్లో టాప్లో నిలిచింది. వాస్తవానికి ఆమె హీరోయిన్. కన్నడలో అనేక చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఆమె తెలుగులో తారకరత్న హీరోగా చేసిన భద్రాద్రి రాముడు సినిమాతో పరిచయమయ్యారు.కుమారస్వామిని రాధిక 2006లో పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఆమె రెండో భార్య. చెప్పాలంటే రాధికకు కూడా అది రెండో పెళ్లే. అంతకుముందే 2000 నవంబరు 26న కటీల్లోని శ్రీ దుర్గా పరమేశ్వరి దేవాలయంలో రతన్కుమార్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె వయసు 14 ఏళ్లు. ఆ పెళ్లి కాస్తా పెద్ద వివాదమే రేపింది. అయితే, ఆ పెళ్లి వల్ల ఆమె సినీ కెరీర్ నాశనమవుతుందని భావించిన రాధిక తండ్రి.. తన కూతురును రతన్కుమార్ కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు. ఆ తర్వాత మైనర్ అయిన తన కూతురు రాధిక పెళ్లిని రద్దు చేయాలని ఆమె తల్లి కూడా కోరారు. రతన్కుమార్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. అంతేకాదు.. రాధికను సజీవ దహనం చేసేందుకూ యత్నించాడని ఆరోపించారుతదనంతర కాలంలో 2002 ఆగస్టులో ఆమె మొదటి భర్త రతన్కుమార్ గుండెపోటుతో మరణించాడు. ఆ తర్వాత 2006లో ఆమె కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన నాలుగేళ్లకు గానీ కుమారస్వామిని పెళ్లి చేసుకున్న విషయం ఆమె బయటకు వెల్లడించలేదు. 2010 నవంబరులో ఆ విషయాన్ని అందరికీ అధికారికంగా ప్రకటించారు. కుమార స్వామి, రాధిక దంపతులకు షమికా కుమారస్వామి అనే గారాలపట్టి ఉంది. కుమస్వామిని వివాహం చేసుకుంది. వీరికి షమిక కుమారస్వామి అనే కూతురు కూడా ఉంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇంకో విశేషమేమిటంటే ఆమెను పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే కుమారస్వామి సీఎం అయ్యారు.