YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యాప్ పై భగ్గుమంటున్న టీచర్లు

యాప్ పై భగ్గుమంటున్న టీచర్లు

నెల్లూరు, సెప్టెంబర్ 3, 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వానికి ఉపాధ్యాయుల‌కు మ‌ధ్య నిప్పు మ‌రింత రాజుకుంది. పాఠ‌శాల విద్యాశాఖ‌లో  నుంచి ఫేస్ రిక‌గ్నైజేష‌న్ హాజ‌రు అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భీష్మించింది. కానీ అందుకు ఉపాధ్యాయులు ఏమాత్రం అంగీక‌రించే ప్ర‌స‌క్తే లేద‌ని క‌రాఖండీగా చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఫోన్‌లలో యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోమని తెగేసి చెబుతు న్నారు.  ప్రభుత్వ మే  అందుకు సంబంధిం చిన పరికరాలు విద్యాశాఖకు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.  ఇదే విషయంపై ఆగస్టు 18న తొలిదశ చర్చలు ఫలించలేదు. ప్రభుత్వం తొలుత 15 రోజులు ఈ-హాజ రుపై శిక్షణ ఇస్తామని ప్రకటించి.. నేటి నుంచి మార్గదర్శకాలు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పాఠశాలల వద్ద హాజరు పరికరాలను ప్రభుత్వమే ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా హాజరు వేసే విధానాన్ని విద్యా వ్యవస్థలో ముందుగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. ప్రభుత్వ టీచర్లకు హాజరును ఈ యాప్ ద్వారా తీసుకుంటున్నారు. అయితే, ఈ యాప్ విషయమై ఉపాధ్యా యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇప్పుడు పోలీసులకు వరంగా మారింది. ఏయే ఉపాధ్యాయులు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నారు.? ఎవరెవరు ఎక్కడి నుంచి విజయవాడకు వచ్చేందుకు ప్రయ త్నిస్తున్నారు వంటివన్నీ ప్రభుత్వానికి  ఈ యాప్ ద్వారా తెలుస్తాయ్.పోలీసులు ఆ యాప్‌ని వినియోగించి ఉపాధ్యాయుల్ని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వాలు తీసు కునే నిర్ణయాలు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలా భంగం కలిగిస్తాయో చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నేతలూ ఆరోపిస్తున్నారు.

Related Posts