YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మణిపూర్ లో జేడీయూకి షాక్

మణిపూర్ లో జేడీయూకి షాక్

ఇంపాల్, సెప్టెంబర్ 5, 
ప్రత్యర్థులు ఇచ్చిన షాక్‌ను.. తిరిగి అంతే స్పీడుతో తిరిగివ్వాలి. లేకపోతే, నేటి రాజకీయాల్లో వెనకబడిపోతాం. అందుకే, పాత మిత్రుడు జేడీయూకి జెడ్‌ స్పీడ్‌తో జబర్దస్త్‌ ఝలక్‌ ఇచ్చింది బీజేపీ. బీహార్‌లో తమను కాదని ఆర్జేడీతో జట్టుకట్టి మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుకున్న నితీశ్‌కుమార్‌కు గట్టి షాకే ఇచ్చింది బీజేపీ. మణిపూర్‌ అసెంబ్లీలో జేడీయూ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురికి కాషాయ కండువా కప్పేసింది. అంతేకాదు, మెజార్టీ కంటే ఎక్కువశాతం మంది పార్టీ మారడంతో పాటు నిబంధనల ప్రకారం వారి విజ్ఞప్తిని సమ్మతిస్తూ జేడీయూఎల్పీ బీజేపీలో విలీనమైనట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు.గత ఎన్నికల వేళ మణిపూర్‌లో 38స్థానాల్లో పోటీచేసిన నితీశ్‌ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, మొన్నటి దాకా ఎన్టీఏలో భాగస్వామిగా ఉంటూ బీహార్‌ సీఎంగా కొనసాగిన నితీశ్‌ అనూహ్యంగా కూటమికి గుడ్‌బై చెప్పి ఆర్జేడీతో జట్టుకట్టారు. బీజేపీకి ఊహించని షాక్‌ ఇచ్చారు. దీనికి, ప్రతీకారంగా ఇప్పుడు కమలం పార్టీ భారీ దెబ్బే కొట్టింది. జేడీయూ నుంచి గెలిచి ఆరుగురిలో ఐదుగురు ఎమ్మెల్యేల్ని లాగేసుకుంది. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు చేరారు కాబట్టి నిబంధనల ప్రకారం స్పీకర్‌ పర్మిషన్‌తో బీజేపీలో జేడీయూఎల్పీ విలీన ప్రక్రియ ముగిసిపోయింది. ఇక, మణిపూర్‌లో నితీశ్‌కు మిగిలింది ఒకేఒక్క ఎమ్మెల్యే. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఈ రాజకీయ పరిణామం నితీశ్‌కు పెద్ద షాకనే చెప్పాలి. ఎందుకంటే, నితీశ్‌కు బీజేపీకి షాకివ్వడం తొమ్మిదో రోజుల్లో ఇది రెండోసారి. అరుణాచల్ ప్రదేశ్‌లో మిగిలిపోయిన ఏకైక జేడీయూ ఎమ్మెల్యే సైతం.. ఆగస్టు 25న కమలం గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో జేడీయూ 7 స్థానాల్లో గెలవగా.. ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లారు. మిగిలిన ఒక్క ఎమ్మెల్యే సైతం.. ఇటీవల కమలం కండువా వేసుకోవడంతో మేటర్‌ క్లోజయ్యింది. తాజాగా, మణిపూర్‌లోనూ అదే జరగడంతో రెండు రాష్ట్రాల్లోనూ జేడీయూ ఉనికి కోల్పేయే పరిస్థితి ఏర్పడింది. దీంతో, తర్వాతి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతోంది.

Related Posts