ముంబై, సెప్టెంబర్ 8,
దేశవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. కోవిడ్-19 నుంచి బయట పడేందుకు ఈమధ్య వరకూ కోవాక్సిన్, కోవీషీల్డ్ ఇంజక్షన్‌లు రెండు విడతలు తీసుకోవడంతో ప్రజలు కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడ్డారు. అయితే కోవిడ్ విస్తరణ తొలిదశలో దాని గురించిన అవగాహన అంతగా లేకపోవడం, ఈ ఇంజక్షన్‌లు అప్పటికి పూర్తిగా అందుబాటులోకి రావడం జాప్యం కారణంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వైద్యపరిశోధక సంస్థల సహాయంతో దేశంలో ఇంజ క్షన్‌ల ఉత్పత్తి పెద్ద స్థాయిలో జరిగింది. దేశంలోనేకాకుండా విదేశాల వారికీ ఈ ఇంజక్షన్‌లు అందు బాటులోకి తెచ్చి భారత్ ప్రతిష్ట పెరిగింది. కరోనా సమయంలో భారత్ ప్రపంచ దేశాల కు చేసిన సహాయ సహకారా లను ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందించింది. కోవిడ్ మూడో దశ వస్తోందన్న భయాందోళనలు వాస్తవానికి అంతగా లేవు. కారణం ఇప్పటికే దాన్ని గురిం చి పూర్తి అవగాహన ప్రజల్లో కలగడం, ఇంజక్షన్‌లు తీసుకోవడం, బూస్టర్‌డోస్ పేర మరో విడత ఇంజక్షన్ తీసుకోవడం కూడా జరుగుతోంది. అయితే, ఈ తరుణంలో ఇంజక్షన్‌ల విషయంలో ఇబ్బందులు తప్పించడానికి ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అందుబాటులోకి వచ్చింది. అంతేకాక, దాని వినియోగానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది.దేశంలోనే తొలి ముక్కు ద్వారా టీకా (నాజల్ ఇన్‌జక్షన్) అందుబాటులోకి వస్తుంది. ముక్కు ద్వారా 18 ఏళ్లు దాటినవారికి ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చారు. నాలుగు వేలమందిపై క్లినికల్ ట్రయల్స్ చేసిన తరువాత సురక్షితమని తేలి నట్లు వెల్లడించింది సంస్థవైరస్పై పోరులో ముందడుగు వేసింది భారత్ బయోటెక్ ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఇప్పటివరకు మనం తీసుకున్న కొవిడ్ టీకాలన్నీ సూది ద్వారా శరీరంలోకి ఇచ్చేవే. అయితే, వాటికి భిన్నంగా ముక్కు ద్వారా తీసుకునే టీకాఇకపై అందుబాటులోకి రానుంది. ఈ తరహాలో తొలిసారిగా.. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవిడ్ నాసల్ వ్యాక్సిన్ (బీబీవీ 154)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంగళవారం అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకాను ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. ముక్కు ద్వారా ఇచ్చే టీకాకు నాలుగు వేల మంది వాలంటీర్ల మీద క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఎటువంటి దు ష్ప్రభావాలు కనిపించలేదని బీబీవీ 154 సురక్షితమని తేలినట్లు పేర్కొంది. ఆగస్టులో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ టీకా కొవిడ్ కు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తుందని తేలినట్లు వివరించింది. కాగా, ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కు అనుమతుల మంజూరు నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ స్పందిస్తూ, కొవిడ్ పై పోరాటంలో మరో పెద్ద ముందడుగు పడిందని అభివర్ణిం చారు. మహమ్మారి మీద సమరంలో భారతీయుల సమష్టిపోరాటాన్ని ఇంకా బలోపేతం చేస్తుంద న్నారు.బీబీవీ 154.. దేశంలో ముక్కు ద్వారా ఇచ్చేందుకు అనుమతులు పొందిన తొలి కొవిడ్ టీకా. మార్పులు చేసిన చింపాంజీ అడినో వైరస్ వెక్టార్ సాయంతో రూపొందించారు. అమెరికాలోని సెయింట్ లూయీస్ లో ఉన్న వాషింగ్టన్ యూనివర్సిటీతో కలిసి దీనిని తయారు చేసినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.