YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పులివెందుల కోసం కసరత్తు

పులివెందుల కోసం కసరత్తు

కడప, సెప్టెంబర్ 10, 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఎవ‌రికీ కొరుకుడు ప‌డ‌నిది ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా. ఈ జిల్లా ఓటర్ల తీర్పు ఎప్పుడు ఎటువైపు ఉంటుందో ఎవ‌రికీ అర్థం కాని ప‌రిస్థితి. త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌లు కూడా ఇక్క‌డి ఓట‌ర్ల మ‌న‌స్త‌త్వాన్ని అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. ఇతర ఓటర్లు అధికార‌పార్టీకి మ‌ద్ద‌తిచ్చిన స‌మ‌యంలో ఇక్క‌డి ఓట‌ర్లు ప్ర‌తిప‌క్షాన్ని అక్కున చేర్చుకుంటారు. ఇత‌ర జిల్లాల ఓట‌ర్లు ప్ర‌తిప‌క్షాన్ని అక్కున చేర్చుకున్న త‌రుణంలో వీరు అధికార ప‌క్షాన్ని ఆద‌రిస్తారు. అంత‌టి సంక్లిష్ట‌త నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఉంటుంది. వైసీపీకి కంచుకోటలాంటిది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఈ జిల్లాపై ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు దృష్టిసారించారు. ఈనెల 14వ తేదీన నెల్లూరులో మినీ మ‌హానాడు నిర్వ‌హిస్తున్నారు. త‌ర్వాత మ‌రో రెండురోజులు ఆయన ఇక్క‌డే మ‌కాం వేయ‌నున్నారు. 15వ తేదీన జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పై నేత‌ల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తారు. 16వ తేదీన నెల్లూరు నుంచి గూడూరు, వెంక‌ట‌గిరి, నాయుడుపేట‌ మీద‌గా రోడ్ షో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోందని భావిస్తున్న చంద్రబాబు నెల్లూరు జిల్లా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు రోడ్ షో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీవైపు మళ్లిన ఓటర్లు ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విభ‌జించిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ బ‌లం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ‌లంగా మారింది. వ‌రుస‌గా జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోను ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించి ఆ పార్టీ కంచుకోట‌గా జిల్లాను మార్చారు. రానున్న ఎన్నిక‌ల్లో ఈ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌ని బాబు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న జిల్లాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టగా, అందుకు విరుగుడుగా చంద్రబాబు వైసీపీకి బలంగా ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టారు. రెండు పార్టీల అధినేతలు ఢీ అంటే ఢీ అంటున్న వాతావరణంలో చేయబోతున్న రోడ్ షోపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.  సగానికి సగమన్నా గెలవాలని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల ధాటికి ఇక్క‌డి టీడీపీ నేత‌లు నెమ్మ‌దించారు. వారిలో చైత‌న్యం నింపి క్యాడ‌ర్ లో జోష్ తీసుకురావ‌డానికి బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్నాళ్లుగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌తోపాటు మినీ మ‌హానాడులు నిర్వ‌హిస్తోన్న టీడీపీకీ అవ‌న్నీ విజ‌య‌వంతమ‌వ‌డంతో శ్రేణుల్లో ఉత్సాహం తొణికిస‌లాడుతోంది. నెల్లూరులో ఉన్న 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం ఐదు నియోజ‌క‌వ‌ర్గాలైనా టీడీపీ ప‌రం కావాల‌నేది అధినేత యోచ‌న‌గా ఉంది. వైసీపీ కంచుకోటలపై ప్రత్యేకంగా దృష్టిసారించిన చంద్రబాబు వాటిని ఎలా చేధిస్తారో చూద్దాం.!

Related Posts