YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జేడీఎస్‌ 37 సీట్లు సాధించినందుకు సంబరాలు చేసుకుంటోందా? నైతికంగా మాదే విజయం: బిజెపి జాతీయ అద్యక్షులు అమిత్‌ షా న్యూదిల్లీ మే 21 (న్యూస్ పల్స్)

జేడీఎస్‌ 37 సీట్లు సాధించినందుకు సంబరాలు చేసుకుంటోందా?     నైతికంగా మాదే విజయం: బిజెపి జాతీయ అద్యక్షులు అమిత్‌ షా న్యూదిల్లీ మే 21 (న్యూస్ పల్స్)

‘కర్ణాటకలో భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాకు బాగానే ఓట్లు పడ్డాయి. అసలు కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఎందుకు సంబరాలు జరుపుకొంటున్నాయి? కాంగ్రెస్‌ మంత్రుల్లో సగం మంది ఓడిపోయారు. సీఎం అభ్యర్ధి ఒక నియోజకవర్గంలో ఓటమిపాలయ్యాడు. ఇక జేడీఎస్‌ 37 సీట్లు సాధించినందుకు సంబరాలు చేసుకుంటోందా? అని బిజెపి జాతీయ అద్యక్షులు అమిత్‌ షా ప్రశ్నించారు.సోమవారం దిల్లీలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌లు‌ పొత్తు పెట్టుకున్నాయని, ఇది సరైనది కాదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఎన్నికల కమిషన్‌, ఈవీఎంలు నచ్చుతాయి. ఎందుకంటే విజయం సాధించలేకపోయినప్పటికీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాయి. ఇదే విధంగా ఓడిపోయినప్పుడు కూడా కాంగ్రెస్‌కు ఈవీఎంలు, ఎన్నికల కమిషన్ నచ్చుతాయని.. సుప్రీం కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటుందని కోరుకుంటున్నాను. బలనిరూపణకు యడ్యూరప్ప ఏడు రోజులు అడిగారని సుప్రీం కోర్టులో కాంగ్రెస్‌ న్యాయవాది అబద్ధం చెప్పారు.’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల తీర్పు అనంతరం జేడీఎస్‌తో కాంగ్రెస్‌‌ పొత్తు పెట్టుకోవడాన్ని భాజాపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తప్పుబట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే బలనిరూపణ చేసుకోలేక రాజీనామా చేసిన విషయం తెలసిందే.

Related Posts