YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కుప్పంపై జగన్ గురి

కుప్పంపై  జగన్ గురి

తిరుపతి, సెప్టెంబర్ 13, 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రాలను పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈనెల 22న కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిలు పరిశీలించారు. హెలిపాడ్‌, బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు. చేయూత కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొనున్నారని మంత్రులు వివరించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 40 వేల దొంగ ఓట్లతోనే చంద్రబాబు ఇప్పటి వరకు కుప్పంలో గెలుస్తూ వచ్చారు. బీసీల ఓట్లతో కుప్పంలో గెలిచిన చంద్రబాబు రైతులకు చేసిందేమి లేదని అన్నారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలి. కుప్పం ప్రజలు నాన్ లోకల్ అయిన చంద్రబాబును ఈ దఫా ఓడించి, లోకల్ గా ఉంటున్న భరత్ ను గెలిపించాలి. భరత్ గెలిస్తే మంత్రి అవుతారు. జగన్ పరిపాలనలో ప్రజలు మేల్కొన్నారు. 22న సీఎం జగన్ కుప్పం పర్యటన విజయవంతం చేయండి అంటూ పిలుపునిచ్చారు. కుప్పం నుండి సీఎం చేతుల మీదుగా చేయూత కార్యక్రమం ప్రారంభం కానుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివరించారు.

Related Posts