ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పినవి అన్ని అసత్యాలేనని సీపీఐ నాయకుడు రామకృష్ణ అన్నారు. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన వారిని సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని అసత్యం చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితి వల్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా రాని పరిస్థితి నెలకొన్నదని, రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.రాష్ట్రంలో అప్పుల పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు స్పష్టంగా చెప్పినా సీఎం జగన్‌కు పట్టడడం లేదని, మళ్లీ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఇప్పటి కైనా రెచ్చగొట్టే ప్రకటనలు ఇకనైనా మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రం కోసం కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నా అభివృద్ధి ఎక్కడా కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.మూడున్నర సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు రావాలని రామకృష్ణ అన్నారు. అక్టోబర్ 14 నుంచి విజయవాడలో సీపీఐ జాతీయ సభలు నిర్వహిస్తున్నామని , ఈ సమావేశాలకు బీజేపీయేతర పాలిత సీఎంలకు ఆహ్వానం పలుకుతున్నామని వెల్లడించారు.