YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మరమ్మతులు లేవు.. నీళ్లు ఇవ్వవు..

మరమ్మతులు లేవు.. నీళ్లు ఇవ్వవు..

వేసవిలో పలుప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి సర్వసాధారణంగా మారింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భజలాలు అడుగంటి పోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తుతోంది. బోర్లలో నీరు రాక నీటి కోసం ప్రజలు నానాపాట్లు పడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఇదిలాఉంటే కరీంనగర్ జిల్లాలోనూ ఈ తరహా సమస్యలు పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో సాగునీటి పథకాల ద్వారా నీరందడంలేదని అంటున్నవారూ అధికంగానే ఉ్ననారు. ఈ ప్రాజెక్టులను మిషన్‌ భగీరథకు అనుసంధానం చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ వాటికి సంబంధించిన పనులు వేగవంతంగా సాగకపోవడం సమస్య తీవ్రతను రెట్టింపు చేస్తోందని చెప్తున్నారు. మరోవైపు అనేకగ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం చేతిపంపులపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ పంపుల్లో అనేకం పనిచేయడంలేదు. మరమ్మతులు నోచుకోక మూలన పడ్డాయి. కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే పంపులు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అయితే అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 

కరీంనగర్ జిల్లాలో వెయ్యికి పైగా బోరుబావులకు సంబంధించిన చేతి పంపులు పనిచేయడం లేదని సమాచారం. వీటిని బాగుచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం ఓ సమస్య అయితే మెకానిక్ లు అందుబాటులో లేకపోవడం.. ఒకవేళ ఉన్నా వారికి చెల్లింపులు చేసే విధానం లేకపోవడం మరో సమస్యగా మారింది. మొత్తంగా వివిధ కారణాలతో చేతిపంపులను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలోని చిన్న గ్రామాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంది. రక్షిత నీటి పథకం అందని ప్రాంతాల్లో ప్రజలు బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వం కొత్త బోరుబావులు వేయడాన్నీ నిషేధించింది. ప్రస్తుతం ఉన్న బోరుబావులకు సంబంధించి చేతి పంపులు మరమ్మతు చేయిస్తే వేసవిలో ఎద్దడి లేకుండా ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఏటా వేసవికి ముందు బోరుబావులను మరమ్మతు చేయిస్తారు. ఇందుకోసం జిల్లా, మండల పరిషత్‌లకు ప్రత్యేక నిధులు ఇచ్చేవారు. ఆ నిధులతో అవసరమైన సామగ్రి కొనుగోలు చేసి మరమ్మతులు చేయించేవారు. మండలానికో మెకానిక్‌ కూడా ఉండేవారు. వారికి వేతనాలు సైతం ఇచ్చేవారు. ప్రస్తుతం జిల్లా, మండల పరిషత్‌లకు  ప్రభుత్వం ఈ తరహా నిధులు ఇవ్వడంలేదని సమాచారం. అందుకే పలు చేతిపంపులు వృధాగా పడిఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ పంపులను వాడుకలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. 

Related Posts