YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మెరుగుపడిన వైద్య సేవలు

మెరుగుపడిన వైద్య సేవలు

సర్కారీ దవాఖానాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పెద్దమొత్తంలోనే నిధులు వెచ్చిస్తూ ప్రజారోగ్యానికి కృషి చేస్తోంది. ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో కొంతకాలంగా ప్రభుత్వాసుపత్రులు బిజీగానే ఉంటున్నాయి. వైద్యసేవల కోసం వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. సిబ్బంది కొరత కొంత ప్రతిబంధకంగా ఉన్నా సర్కారీ దవాఖానాలకు వస్తున్నవారు అధికమవుతున్నారు. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం.. ఆసుపత్రులను మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదిలాఉంటే సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటూ సమర్ధవంతమైన సేవలు అందేలా చూస్తోంది సర్కార్. మొత్తంగా ప్రభుత్వ చొరవతో ఆదిలాబాద్ లోని ప్రభుత్వాసుపత్రులు అందించిన సేవలకు సముచిత గౌరవం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ఎక్స్‌లెన్సీ పురస్కారానికి జిల్లాను ఎంపిక చేసింది. ప్రభుత్వం పెద్దాసుపత్రులనే కాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతంపైనా దృష్టి పెట్టింది. దీంతో ప్రాథమిక వైద్య కేంద్రాల్లోనూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నాయి. ఈ కేంద్రాలు పేరుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన ఇక్కడ రోగులకు కల్పించిన సౌకర్యాలు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఏ ఆసుపత్రికి లేనివిధంగా కార్పొరేట్‌స్థాయిలో రోగులకు అనువైన పడకలు, ఆపరేషన్‌ థియేటర్‌, ల్యాబోరేటరీ, అధునాతన పరికరాలు, సౌకర్యాలతో కూడిన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి.

 

ప్రభుత్వాసుపత్రుల్లో అపరిశుభ్ర వాతావరణం తరచూ పతాకశీర్షికలవుతుంటుంది. అయితే జిల్లాలో పలు ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి సమస్యే లేదు. స్వచ్చత విషయంలో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చికిత్సలకు వాడిన సిరంజిలు, గ్లూకోజ్‌బాటిళ్లు వంటివి పడేసేందుకు ప్రత్యేకంగా డస్ట్ బిన్స్ ఏర్పాటుచేశారు. దుర్వాసన లేకుండా ఎప్పటికప్పుడు ఆసుపత్రి గదులను, వరండాను శుభ్రం చేస్తున్నారు. మొత్తంగా స్వచ్ఛతకు మారుపేరుగా ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నారు. అంతేకా కేంద్రాల్లో వివిధ విభాగాల్లో మార్పులు చేర్పులు చేశారు. మందులకు ప్రత్యేకకౌంటరు ఏర్పాటుచేసి ఔషదాల వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నమోదు చేస్తున్నారు. మందుల కొరత రాకుండా అవసరమైన మాత్రలు, మందులను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నారు. ఇక సిబ్బంది కూడా అక్కడే ఉంటున్నారు. దీంతో సర్కారు ఆసుపత్రులకు కొత్త కళ వచ్చినట్లైంది. సర్కారీ దవాఖానాల్లో పరిస్థితులు మెరుగుపడడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రామాల్లో ఉండే ఆశాకార్యకర్తలు మొదలుకొని ఏఎన్‌ఎంలు, వైద్యులు గర్భిణుల ఆరోగ్యంపై  ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో స్థానికంగా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts