YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొత్త స్కెచ్ లో టీడీపీ.....

కొత్త స్కెచ్ లో టీడీపీ.....

విజయవాడ, సెప్టెంబర్ 20, 
ఏపీలో మూడేళ్లుగా ఒకే అంశంపై వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఆ అంశం ఏది అనే సంగతి అందరికీ తెలిసిందే..దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని విషయంపైనే ఏపీలో పెద్ద రచ్చ ఉంది. రాష్ట్రం విడిపోయాక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..అమరావతిని రాజధానిగా పెట్టారు. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఒప్పుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గెలిచాక..మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. టీడీపీ ఏమో అమరావతి ఒకటే రాజధాని ఉండాలని పోరాటం చేస్తుంది.అమరావతి రైతులు, ప్రజలు సైతం ఒకే రాజధాని అని ఉద్యమం చేస్తున్నారు. ఇటు వైసీపీ నేతలు ఏమో మూడు రాజధానుల పాట పాడుకుంటూ వస్తున్నారు. ఇలా అమరావతి వర్సెస్ మూడు రాజధానులు అంటూ రాజకీయం నడుస్తోంది. ఇక మూడు రాజధానుల విషయంలో కోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా మళ్ళీ బిల్లు తీసుకొస్తామని, త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని వైసీపీ మంత్రులు అంటున్నారు.ఇక అమరావతి టూ అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్న రైతులని ఉత్తరాంధ్రలో అడ్డుకుని తీరుతామని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే మూడు రాజధానుల బిల్లుపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇలా మూడు రాజధానుల విషయంలో వైసీపీ దూకుడుగా ఉంది. అయితే వైసీపీకి చెక్ పెట్టేలా టీడీపీ సైతం అమరావతికి మద్ధతుగా రాజకీయం నడిపిస్తుంది. ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న రైతులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్ధతు పలుకుతున్నారు. వారు కూడా పాదయాత్రలో భారీగా పాల్గొంటున్నారు.ఇక ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చేలా.. అక్కడ టీడీపీ నేతలు సైతం అమరావతికి మద్ధతుగా ర్యాలీలు చేస్తున్నారు. విశాఖని అభివృద్ధి చేసిందే చంద్రబాబు అని, ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖని జగన్ దోచుకుంటున్నారని, రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని, అది కూడా అమరావతి అని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు గళం విప్పుతున్నారు. ఇలా వైసీపీ ఏమో మూడు రాజధానులు అని, టీడీపీ అమరావతి అని రాజకీయం చేస్తూ..చివరికి రాష్ట్రానికంటూ ఒక రాజధాని లేకుండా చేశారు.

Related Posts