న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20,
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఐటీ, ఈడీ, సిబీఐ దక్షిణాది అధికారులతో సమా వేశమవుతుండ డం వెనుక ఆంతర్యమేమిటని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు కాస్తంత భయపడుతూ న్నారు. లిక్కర్ స్కామ్‌లు, అవినీతి, దేశద్రోహచర్యల మూలాలు ఇక్కడే ఉన్నాయని ఇటీవల కేసుల్లో బయటపడటంతో అమిత్ షా సమావేశం ఫలితం ఎలా ఉంటుందన్నది ఇటు రాజకీయనాయకుల్లోనూ ఖంగారుపెట్టిస్తోంది. ఈ కేసులు, సాక్షాలు బయటపడటంతో రాజకీయపరంగా రాష్ట్రాల ప్రతిష్ట దిగజారి కేంద్రం చెప్పినట్టు జీ హుజూర్ అనాల్సి వస్తుందన్న ఆందోళనతో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. అయితే, కేంద్ర హోం మంత్రి గనుక అమిత్ షా పరిశోధనా సంస్థలతో భేటీ కావడం, సమాచారం తెలుసు కోవడానికి ఆయనకు ఎంతో అవకాశం ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాడులు జరుగుతున్న ఈ తరుణంలోనే ఆయన వచ్చి హైదరాబాద్‌లోని పటేల్ పోలీస్ అకాడమీలో ఈ సమావేశం నిర్వహించడమే రాజకీయవర్గాలకు అంతుచిక్కడం లేదు. ఒకవేళ దర్యా ప్తును మరింత వేగం చేయమని సూచించారా లేక ఈ దర్యాప్తును అడ్డుపెట్టుకుని టీఆర్ ఎస్‌కు, అటు వైసీపీకి చిన్న షాక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారా అన్నది ఇంకా తేలవలసి ఉంది. కేసుల సంబంధించి దర్యాప్తుపై రివ్యూ కోసం చర్చిస్తే ఫరవా ఇల్లే.. అలాగాకుండా ఈడీ, సిబీఐలతో రాజ కీయ అంశాలు కూడా చర్చించి కొత్త వ్యూహాలు రచిస్తున్నారన్న అనుమానం తలెత్తుతోంది. అదే నిజమైతే టీఆర్ ఎస్, వైసీపీలు మరింత జాగ్రత్తపడాల్సి వస్తుంది. అయితే, ఈ సమావేశం కేసీఆర్‌ను ఇరకాటం పెట్టడానికి వ్యూహాలు పటిష్టంగా అమలు చేసే దిశ గా మార్గనిర్దేశం చేయవచ్చు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ను కూల్చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుని అన్ని విధాలా, అన్ని మార్గాలను మూసేసి ఉక్కిరిబిక్కిరి చేయడానికే కమలనాథులు పూనుకున్నారు. వీలు దొరికినపుడల్లా కేంద్రం నుంచి బీజేపీ సీనియర్లు తెలంగాణాలో పర్యటించి ఏదో ఒక సభ, సమావేశం పేరుతో ఇక్కడి బీజేపీ కార్యకర్తలను, నాయకులను ఉత్తేజపరిచి, మరింత దాడులకు ఉసి గొల్పుతున్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బయటపడటంతో కేసీఆర్ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఈ అవకా శాన్ని బీజేపీ ఏమాత్రం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. మునుగోడు ఎన్నికలకు ముందే కేసీఆర్ కుటుంబ పరువు రోడ్డుకి ఈడ్చేందుకు బీజేపీ వర్గాలు శతవిధాల ప్రయత్నస్తూనే ఉంది. దీనికి తోడు తాజాగా ఎన్ ఐ ఏ దాడులు చేపట్టడం రాష్ట్రం పరువుపోయి అవమానభారంతో కేసీఆర్ ప్రభు త్వం ఇబ్బందుల్లో పడింది. అటు జగన్ సర్కార్ కూడా ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నది. రెండు రాష్ట్రాల మీద దర్యాప్తుసంస్థల చూపు బలపడుతున్నవేళ అమిత్ షా అదే దర్యాప్తు సంస్థల అధికారులతో హైదరా బాద్ వచ్చి ప్రత్యేకంగా సమావేశం కావడంతో కేసీఆర్, జగన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందనాలి.