ప్రాంతీయ పార్టీలను కబళించేందుకు బీజేపీ యత్నిస్తోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఒఇపుపు నిచ్చారు. కర్ణాటకలో ‘గాలి’, ఏపీలో ‘జగన్’ లు బీజేపీకి లెఫ్ట్ రైట్ గా ఉన్నారని విమర్శించారు. కర్ణాటక రాజకీయ పరిణామాలపై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత దేవెగౌడతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కుమారస్వామి ప్రమాణస్వీకారానికి చంద్రబాబునాయుడు హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. బీజేపీ విధానాల వల్ల దేశంలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని, రాజ్యాంగాన్ని, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.