బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. విడిపోయిన రాష్ట్రం కష్టాలలో ఉంటుందని బీజేపీ తో జత కట్టమని అన్నారు. ఇచ్చిన మాట తప్పింది. తెలుగు వారు ఎక్కడున్నా బీజేపీ ని దెబ్బతీయలని చెప్పానని అయన అన్నారు. కర్ణాటక లో తెలుగు దెబ్బ బీజేపీ రుచి చూసింది. కర్ణాటక లో బీజేపీ ఓడిపోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. కర్ణాటక లో దొంగచాటుగా బీజేపీని గెలిపించాలని ఓ పార్టీ చేసింది. కేసులు మాఫీ చేయించు కోవడానికి బీజేపీతో చేతులు కలిపారు. నన్ను ఇబ్బందులకు గురి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అవినీతి పరులను పక్కన పెట్టుకొని నీతిమాటలను మాట్లాడుతూన్నారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వారిని ప్రోత్సహించి బీజేపీ ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని అయన అన్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్య నికి సుప్రీం కోర్టు దారి చూపింది. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. గుంటూరులో వైసీపీ వాళ్ళు అరాచకాలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీడీని ఆర్కిటలాజి డిపార్ట్ మెంట్ కు కట్టబెట్టాలని చూస్తున్నారు. బ్రాహ్మణులకు అత్యంత ప్రధాన్యతని ఇస్తున్నాం. బీజేపి, వైసీపీ కలిసి ఆంద్రప్రదేశ్ లో కుట్ర రాజకీయాలు చేస్తుంది. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు ఆంద్రప్రదేశ్ లో సాగవని అన్నారు. కొత్తగా వచ్చి పార్టీలు పెట్టిన వారు.. మొన్నటి వరకు పొగిడి ఇవాళ విమర్శిస్తున్నారని అయన వ్యాఖ్యానించారు.