హైదరాబాద్
టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.
కృష్ణ-ఇందిరాదేవికి రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతోపాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.