న్యూఢిల్లీ
పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పై కేంద్రం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతోపాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై పీఎఫ్ఐ కార్యాలయాలపై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ను కేంద్ర హోంశాఖ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడులలో దాదాపు 240 కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పట్నాలో ప్రధాని మోదీ హత్యకు కూడా కుట్ర చేసినట్లు ఆరోపణలన్నాయి.
పిఎఫ్ఐకి సిమి, జమాతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్, ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలతో సంబంధాలున్నాయని ప్రభుత్వ ప్రకటన పేర్కోంది. ఒక వర్గానికి చెందిన వారిని ఉగ్రవాదంవైపు రెచ్చగొడుతుందని పేర్కోన్నారు.