బెంగళూర్, సెప్టెంబర్ 28,
అబ్బాయిలు గర్ల్‌ఫ్రెండ్స్... అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ కామన్ అయిపోయింది. యువతీ, యువకుల జీవితాల్లో ప్రేమలు, బ్రేకప్‌లు కూడా సహజం. ఈ క్రమంలో బెంగళూరులో కొత్త వెబ్‌సైట్ పుట్టుకొచ్చింది. వాళ్లు అమ్మాయిలకు.. అద్దె బాయ్‌ఫ్రెండ్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇదేంటి నీచంగా అనుకుంటున్నారా..? అప్పుడే అలాంటి అభిప్రాయానికి రాకండి. ఎందుకంటే దీనిని మంచి ఉద్దేశంతోనే ఏర్పాటు చేశామని వాళ్లు అంటున్నారు. కానీ ఇదేం పోకడ అని కొందరు విమర్శిస్తున్నారు. అమ్మాయిలు ఎంతగానో ఇష్టపడినా.. ఒక్కొక్కసారి వారి బాయ్ ఫ్రెండ్స్ దూరమైపోతుంటారు. అంత ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా దూరమైపోతే... తట్టుకోవడం కష్టం. అందుకే వాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఇక జీవితం వేస్ట్ అని.. ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తారు. అలాంటి వారికి అండగా ఉండేందుకే.. ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన కొందరు యూత్ కలిసి ఒక వెబ్‌సైట్ ప్రారంభించారు. ‘టాయ్ బాయ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్ ద్వారా బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకు ఇస్తారు. ఇలా ఇవ్వడానికి కొన్ని రూల్స్ కూడా పెట్టారు.బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకివ్వడమంటే వారితో బయటకు వెళ్లడం.. షాపింగ్‌లు, రెస్టారెంట్లకు తిరగడం వంటివి ఉండవు. అద్దె బాయ్ ఫ్రెండ్ కేవలం ఫోన్ లేదా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాడు. అద్దెకు తీసుకున్న వ్యక్తి.. డిప్రెషన్‌లో ఉండే అమ్మాయిలతో ఫోన్‌లో మాట్లాడతాడు. వారి సమస్యను విని.. వాళ్ల ఆందోళననను, వేదనను తగ్గించేందుకు ప్రయత్నిస్తాడు. లవ్‌లో ఫెయిలై... మోసపోయిన అమ్మాయిల బాధను తొలగించడం, వారి ఒంటరితనాన్ని దూరం చేయడం ఈ వెబ్‌సైట్ ప్రధాన ఉద్దేశం.ఈ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా యూజర్లు ఈ సేవలు పొందవచ్చు. దీనికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అద్దెకు బాయ్ ఫ్రెండ్‌ను పొందాలంటే.. గంటల లెక్కన ఫీజు ఇచ్చుకోవాలి. ప్రస్తుతం ఈ స్టార్టప్ కంపెనీని బెంగళూరుకు చెందిన కొందరు యువత పెట్టారు. జపాన్ లాంటి దేశాల్లో ఈ తరహా సేవలు ఉన్నాయి. కానీ మనలాంటి దేశాల్లో చాలా కొత్త పద్దతి. అందుకే కొందరు దీనిని చాలా వ్యతిరేకిస్తుంది. ఇదేం బరితెగింపు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి వాటిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. దీనిపై అందరికి ఆసక్తిగా ఉంది. కాగా ఈ మధ్య కాలంలో అనేక డేటింగ్ యాప్‌లు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి. మరీ వాటి సంగతి కూడా చూడాలి.