YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బొత్సగారి నిర్వేదం

బొత్సగారి నిర్వేదం

విజయనగరం, సెప్టెంబర్ 30, 
వినాల్సిన స‌మ‌యంలో వినాలి, చెప్పాల్సిన స‌మ‌యంలో చెప్పాలి, అనువుగా ఉంద‌ని చొర‌వ‌దీసుకుని రెచ్చిపోతే అప‌వాదులు ఎదురై చ‌తికిల‌ప‌డాలి. అట్టి స‌మ‌యంలో క‌లిగిన జ్ఞానోద‌య‌మే మ‌న‌సులో మాట తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది.  ఇపుడు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కి క‌లిగిన జ్ణానోదయం అలాంటిదే. అందుకే వారసులను తీసుకు వచ్చినా గెలిపించుకోవడం అంత తేలిక కాదని బాహాటంగా చెప్పేశారు. అసలు నేపథ్యం ఏమిటంటే.  ముఖ్య‌మంత్రి ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశమై  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం లేదని క్లాసు పీకారు. అలా అస్సలు పాల్గొనని ఓ 27 మందికి ప్రత్యేకంగా పని తీరు మెరుగుపరుచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లిచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చారు.ఆ సందర్భంలోనే వారసులతను తెరపైకి తెచ్చి విశ్రాంతి తీసుకుందామని భావిస్తున్న వారికి కూడా గట్టి హెచ్చరిక చేశారు. వారసులెవరినీ తాను ప్రోత్సహించననీ, మీ పని తీరు మార్చుకుంటే మీకే టికెట్లిస్తాననీ, లేకుంటే కొత్త వారిని తెరమీదకు తీసుకువస్తాననీ, ఈ సందర్భంగానే సమావేశం తరువాత విలేకరులతో మాట్లాడిన బొత్స అసలు విషయం చెప్పేశారు. వారసులను తీసుకు రావడం పెద్ద విషయం కాదు..వారిని  గెలిపించు కోవ‌డ‌మే బ‌హుక‌ష్ట్ అని మ‌న‌సులో మాట పైకే అనేశారు.అంతే క‌ష్టాలు ఎప్పుడూ స‌త్యాన్ని ఆ మాత్రం బ‌య‌టికి చెప్పేలా చేస్తాయి.  బొత్స‌యినా, జ‌గ‌న్ అయినా!  అలాగా కున్నా, రాజ్యంలో త‌మ‌కే ప్ర‌గ‌తి లేన‌పుడు ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న వార‌సుల్ని రంగంలోకి ఎలా దింపుతారు.  చిత్రం వంద‌రోజులు ఆడితేనేగా హీరోగారికి వీరాభిమానులు ప‌ట్టం గ‌ట్టేది. స్వీట్లు  పంచుకు నేది. ఇక్క‌డ వైసీపీ పాలన మూడు వంద‌ల రోజులు గ‌డిచిపోయినా ఉత్సాహంగా చెప్పుకోవ‌డానికి, ఘ‌నంగా ప్ర‌చారం చేసుకోవ‌డానికేమీ లేదన్న తత్వం బోధపడటం వల్లనే బొత్సగారు వారసుల విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాలో చెప్పకనే చెప్పేశారు.  

Related Posts