ఏలూరు, అక్టోబరు 1,
పిల్లాడి పుట్టిన రోజుకి, బడిలో చేరేడనో బంధువులతోపాటు చుట్టుపక్కలవారూ కానుకలు ఇస్తుండడం ఒక అనవాయితీ. వారికి అదో ఆనందం. ఇచ్చేది బాగా ఆలోచించే ఇస్తారు.. చిన్నపిల్లలకి ఇస్తున్నామన్న ధోర ణిలో. అవి వీలయినంత కాలం ఉపయో గిస్తారు. డ్రస్, బ్యాగ్, మరేదయినా వస్తువు, కనీసం జామెట్రీ బాక్స్ అయినా. చిత్రమేమంటే, ఆంధ్రాలో ప్రభుత్వం ఆర్భాటానికి ఇచ్చిన వస్తువులు ఆ వెంటనే పాడ యి పోవడం గమనిస్తు న్నాం. విద్యార్ధులకు విద్యాకానుకగా ప్రభుత్వం విద్యార్థులకు బ్యాగులను కానుకగా ఇచ్చింది. కానీ వాటి నాణ్యత విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదు.విద్యార్థులకు కానుకలు ఇచ్చి వారికి ఎంతో మద్దతునిస్తున్నామని శభాష్ అనిపించుకోవాలన్న ఆతృతే తప్ప వాస్తవానికి అందులో ఏమీ లేదు. ప్రచార ఆర్భాటాలకు చేసే కానుక ఉత్సవాలు ఇలానే ఉంటాయి. కోట్లు తగలేసి బ్యాగులు ఇచ్చారు. కనీసం వాటి నాణ్యతను పరిశీలించే జాగ్రత్త తీసుకోలేదు. ఎవరికో పెద్ద మొత్తంలో ఈ కాంట్రాక్టు ఇచ్చి కాయితాలమీద కాంట్రాక్టులు జరిపేసి నాణ్యత విషయానికి గాలికి వదిలేశా రని విమర్శకులు అంటున్నారు. చిత్రమేమంటే, ఆ బ్యాగులు కనీసం మూడు నెలలన్నా సరిగా లేవు. అపుడే చిరిగిపోయి పిల్లలు మళ్లీ పాత బ్యాగ్‌లను మోస్తున్నారు. మరి వందకోట్లు ఎటుపోయినట్లు? ఐదుపుస్తకాలు, జామెట్రీబాక్స్, టిపిన్ బ్యాక్స్ పెట్టుకోవడానికే పనికి రాని బ్యాగులు ఇచ్చి ప్రయోజనమేమిటని విద్యార్థుల తలిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రచార ఆర్భా టం కోసమే ఈ కానుక ఇవ్వడాలు నిర్వహించారన్నది బయటపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులను పక్కన పడేసి, సొంత డబ్బుతో బ్యాగులు కొనుక్కోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. నాసిరకం బ్యాగులు విద్యాకానుకను అప్రతిష్ఠపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాడయిన బ్యాగులను వెంటనే మార్చాలని, పాఠశాలల వారీగా వివరాలు సమర్పిం చాలని తాజాగా పాఠ శాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 10లోగా వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం హాస్యాస్పదం.ముందు లేని జాగ్రత్త ఇపుడు వెంటనే స్పందించి వాటి స్థానంలో మళ్లీ కొత్తవి ఏర్పాటు చేయాలన్నది అనాలోచితమే అవుతుంది. అదేదో ముందే నాణ్యత విషయంలో కాస్తంత జాగ్రత్త తీసుకున్నా ప్రభుత్వానికి పరువుదక్కేది. కానీ నిర్లక్ష్యంతో వ్యవహరించేవారికి నాణ్యత మాట గుర్తుకు వచ్చి నట్లు లేదని విమర్శకులు అంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 47లక్షల మంది విద్యార్థులు చదువుతారని పాఠశాల విద్యా శాఖ అంచనా వేసింది. ఆ మేరకు విద్యాకానుకలు కొనుగోలు చేసింది. మొత్తం రూ.931 కోట్లు ఖర్చు చేసిన ట్లు ప్రకటించింది. అయితే, విద్యాకానుకలో ఇచ్చే బ్యాగులు, బెల్టులు, బూట్లు, సాక్సుల వారీగా ఒక్కోదానికి ఎంత వెచ్చించిందనే విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదు. ప్రభుత్వం అంచనా వేసినంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరలేదు. అంచనాలకు భిన్నంగా చాలా మంది ప్రైవేటుపాఠశాలల బాట పట్టారు. దీంతో చివరికి 41,24,139 మందికి మాత్రమే విద్యా కానుక లు పంపిణీ చేసింది.విద్యార్థు లకు మూడు సైజుల్లో బ్యాగులు అందజేసింది. 1 నుంచి 4 తరగతుల విద్యార్థులకు చిన్నవి, 5 నుంచి 7 తరగతులకు వారికి మీడియం సైజు, 8 నుంచి 10 తరగతుల వారికి పెద్ద బ్యాగులు పంపిణీ చేసింది. కానీ చాలా ప్రాంతాల్లో బ్యాగులు, సాక్సులు, షూలు కూడా అధ్వాన్నంగా ఉన్నాయన్న వార్తలే వినబడుతు న్నాయి. ఇపుడు వీటన్నింటికీ కొత్త వి ఏర్పాటు చేయడానికి చాలా సమయమే పడుతుంది. అలాంటపుడు వారి విద్యార్ధి కానుక ఏ మేరకు ప్రజోపయోగం అవుతుందో జగన్ సర్కార్ వివరించాలి.