YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చింతకాయల అయ్యన్నకు ప్రశ్నలే ప్రశ్నలు

చింతకాయల అయ్యన్నకు ప్రశ్నలే ప్రశ్నలు

విశాఖపట్టణం, అక్టోబరు 3, 
సాయింత్రం చీక‌టిప‌డేవేళ  ఇంటిముందు పోలీస్ జీప్ ఆగింది...న‌లుగురు  పోలీసులు  ఇంట్లోకి  వెళ్లి ఫ‌లానా వ్యక్తి ఎక్క‌డ అని ఆ ఇంటావిడ‌ని ప్ర‌శ్నిస్తారు. వారి పిల్ల‌ల్ని బెదిరిస్తారు.. మీ నాన్న ఎక్క‌డ్రా.. అని... ఇది ఓ సినిమా సీన్‌. స‌రిగ్గా  ఇలానే జ‌రిగింది ఉత్త‌రాంధ్ర  న‌ర్సీప‌ట్నంలో. తెలుగుదేశం సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడి కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్ ఇంటికి వెళ్లి, ఆయ‌న లేక‌పో వ‌డంతో ఆయ‌న ఎక్క‌డికి వెళ్లారు, ఎప్పుడు వ‌స్తార‌ని ఆయ‌న పిల్ల‌ల్ని పోలీసులు ప్ర‌శ్నించారు. చింత‌కాయ‌ల విజ‌య్‌ని విచార‌ణ‌కు ర‌మ్మ‌ని  ఏపీ సీఐడీ పోలీసులు నోటీస‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఏ కార‌ణం చేత నో ఆయ‌న సైబ‌ర్ క్రైమ్ బ్రాంచ్‌కి వెళ్లిన‌ట్టు లేదు. కానీ పోలీసులు మాత్రం చాలా దురుసుగానే వ్య‌వ‌హ‌రిం చార‌ని ఆరోప‌ణ‌లు వినవ‌స్తున్నాయి. ఇంట్లో లేని వ్య‌క్తి  గురించి  ఇంట్లో ఉన్న‌పెద్ద‌వారిని ప్ర‌శ్నించాలి. వారు స‌రిగా స‌మాధానం ఇవ్వ‌లేద‌ని భావిస్తే, ఆ వ్య‌క్తిని వ‌చ్చి క‌ల‌వ‌మ‌ని హెచ్చ‌రించి వెళ్లాలి. కానీ ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. పిల్ల‌ల్ని బెదిరించి వెళ్ల‌డం ఏమిటి అని తెలుగు దేశం విరుచుకుప‌డుతోంది.జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ నేత అయ్యన్నపాత్రుడు కుటుంబపై మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరి స్తోంది. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడిచేశారు. రాష్ట్రంలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చెయ్యడం లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.అయితే ఇదంతా అధికార ప‌క్షం ప‌నిగ‌ట్టుకుని క‌క్ష‌సాధింపు చ‌ర్య‌గా చేయనిస్తోంద‌న్న ప్ర‌చారం బాగా ఉంది. ఇప్ప‌టికే పాల‌నాప‌రంగా, ప్ర‌జాభిమానం దృష్ట్యా ప్ర‌తిష్ట కోల్పోయిన జ‌గ‌న్ స‌ర్కార్ ఇలాటి వాటికీ వెనుకాడ‌ద‌న్న అభిప్రాయాలే వ్యక్త‌మ‌వుతున్నాయి. విప‌క్షాన్ని వీల‌యిన‌పుడ‌ల్లా వేధించ‌డానికి, ఇర‌కాటం లో ప‌డేయ‌డానికే జ‌గ‌న్ స‌ర్కార్ పూనుకుంది. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు, టీడీపీ యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి పోలీసు లు దోపిడీదొంగల్లా చొరబడడాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఖండించారు. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పనివాళ్లను భయ భ్రాంతులకు గురిచేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. ఐదేళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడని చంద్రబాబు విమర్శించారు.  నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సీఐడీ పోలీసులు డ్రైవర్ పై దాడి చేయ డం ఎందుకని ప్రశ్నించారు. జగన్ రెడ్డి కేసులు, విచారణల పేరుతో ప్రతిపక్ష నేతలపైకి పోలీసులను రౌడీల్లా ఉసిగొల్పుతున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ విభాగాన్ని అడ్డంపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటని చంద్రబాబు పేర్కొన్నారు.

Related Posts