లక్నో, అక్టోబరు 3,
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా ఉంది. గత కొంత కాలంగా నారోగ్యంతో బాధపడుతున్న ములాయం ఆగస్టు 22వ తేదీ నుంచి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆంకాలజిస్టులు డాక్టన్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల్ కటారియాల పర్యవేక్షణలో ఐసీయూలో ములాయంకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి ములాయం ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ఆయన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వద్దకు వచ్చారు. ములాయం త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ దాస్ మౌర్య అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ములాయం ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ములాయం మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనీ, దానికి తోడు వయస్సుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయనీ వైద్యులు తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ వరుసగా మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. నేతాజీ అని పిలవబడే ములాయం యాదవ్.. తొలిసారిగా 1967లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు