YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కీలక శాఖల్లో కనిపించని 40 వేల కోట్లు మాయం

కీలక శాఖల్లో కనిపించని 40 వేల కోట్లు మాయం

విజయవాడ, అక్టోబరు 6, 
బడ్జెట్‌లో ప్రతిపాదించారు.. ఆయా శాఖలకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు  కూడా ఇచ్చేశారు.. ఇక అభివృద్ధి చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసేశారు.. అయితే నాలుగు నెలలైనా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దీంతో ఈ సొమ్ము ఏమైందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మొత్తం ఏకంగా రూ.40 వేలకోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఈ సొమ్మంతా ఎటు మళ్లిందన్నదానిపై ఆయా శాఖల అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. ఆర్థికశాఖ ద్వారా తెలిసిన గణాంకాల మేరకు నాలుగు నెలల్లో ఖర్చు చేయాల్సిన రూ.41,170 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని సమాచారం. ఈ మొత్తం నిధులను ఆయా శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్‌ సమయంలోనే ఏయే రంగాలకు ఎంత నిధులు ఎలా ఖర్చు చేయాలన్నదానిపై శాసనసభలో ఆమోదం కూడా పొందారు. ఇవే రంగాలకు నిధులు ఖర్చు చేయాలని ఆర్థిక నిబంధనల్లో కూడా ఉంది. ఈ నిబంధనలను మాత్రం ఆర్థికశాఖ పాటించడం లేదు. కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేసే పరిస్థితి కల్పించడం లేదని పలు శాఖల అధికారులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులను జీతాలు, పింఛన్లు, నగదు బదిలీ వంటి వాటికి మళ్లిస్తున్నట్లు వారు చెబుతున్నారు. బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ నిధులు విడుదల చేయడం లేదని, కొన్ని శాఖలకు విడుదల చేసినా వాటిని వెనక్కు తీసుకుంటున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభివృద్ధి మాట అటుంచి కనీసం శాఖల్లో నిర్వహణ వ్యయం కూడా సమకూర్చుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు ఆర్థిక నిర్వహణ కోసం కేటాయించిన నిధుల్లో ఆర్థికశాఖ వందకు పైగా పద్దుల్లో ఏకంగా రూ.16 వేలకోట్లకు పైగా ఖర్చు చేయలేదు. కీలకమైన విద్యాశాఖలో రూ.4,400 కోట్లకుపైగా వ్యయం చేయలేదట. మున్సిపల్‌ శాఖలో రూ.2,400 కోట్లు, రెవెన్యూ శాఖలో రూ.2,100 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖలో రూ.3 వేలకోట్లు ఖర్చు చేయలేదు. దీరతో పట్టణాలు, గ్రామాల్లో తాగునీరు, రోడ్లు వంటి అవసరాలను కూడా అధిగమించలేని పరిస్థితి ఉందని ఆయాశాఖల అధికారులు అరగీకరిస్తున్నారు. వ్యవసాయ సీజన్‌లో రైతులకు సక్రమంగా నీటిని అందించాల్సిన నీటిపారుదల శాఖలో కూడా రూ.2,500 కోట్ల వరకు నిధులను ఖర్చు చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇవే అంశాలపై ప్రతినెలా అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం నుంచి ఆర్థికశాఖకు పదేపదే లేఖలు వస్తున్నప్పటికీ స్పందన మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి.

Related Posts