కడప
తమ జాతీయ కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసీ రెడ్డి అన్నారు గురువారం కడప లోని ఆపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు భారత్ జూడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇవ్వానున్నారని తెలిపారు ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర ప్రదేశ్ హక్కు, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరిఅది ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యం ప్రాంతీయ పార్టీల మాయలో పడవద్దు, ఇచ్చేశక్తి లేదు నమ్మవద్దని పిలుపు.2024 లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపు.
చంద్రబాబు,జగన్ పవన్ కు ఓటేస్తే దేశంలో సెక్యులర్ విధానాలు అవలంబించే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరారుబిఅంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ ఈ ముగ్గురికి ఎవరికి ఓటు వేసిన బిజెపి కి వేసినట్లు అవుతుందని చెప్పారు
బిజెపికి ఓటు వేస్తే మన మెట్టుతో మనం కొట్టుకున్నట్టే.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో సభ ఏర్పాటు చేస్తే ప్రజలు తరిమి కొట్టాలి.గతంలో కేసీఆర్ మన రాయలసీమ ప్రజలను బట్టలు ఊడదీసి కొడతారని రాయలసీమ బిర్యాని పేడతో సమానమన్నారు. సిగ్గులేకుండా ఆంధ్రప్రదేశ్లో సభ విధంగా ఏర్పాటు చేస్తాడు.జగన్ కాలేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి మళ్లీ కెసిఆర్ పిలవగానే కాలేశ్వరం ప్రాజెక్టుకు ప్రారంభానికి వెళ్ళాడు..
జగన్, కేసీఆర్ దొందూ దొందే..
వారి స్వార్థం కోసమే పార్టీ పెట్టారు. కేసీఆర్ తన కొడుకుకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పి ఆయన దేశంమీద పడ్డారని ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వెంకట్రామిరెడ్డి బండి జకరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీకటి చార్లెస్ నగర అధ్యక్షుడు ఓబులేసు,కొపూరి శ్రీనివాసులు,
విష్ణుప్రీతంరెడ్డి, సత్తార్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు