న్యూ డిల్లీ అక్టోబర్ 8
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మిగిలిన రాష్ట్రాల్లో ఎలాంటి ముంపు సమస్యలు తలెత్తవని కేంద్ర జలసంఘం స్పష్టంగా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్స్ వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు సమస్య తలెత్తుతుందని తెలంగాణా ఛత్తీస్ ఘర్ ఒడిస్సాలు గోల చేస్తున్న విషయం తెలిసిందే. పై రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ నిపుణులకు కేంద్ర జలసంఘం ముంపు సమస్య వస్తుందన్న ఆందోళనను క్లియర్ చేసింది. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు ఎదురుకావని భరోసా ఇచ్చింది.ముంపు సమస్యలు తాజా వరదల ప్రభావం అంచనాలతో భవిష్యత్తులో ఏర్పడబోయే సమస్యలపై కేంద్ర జలసంఘం పై మూడు రాష్ట్రాల ఉన్నతాధికారుల నిపుణుల అనుమానాలకు సమాధానాలు చెప్పింది.పోలవరం ప్రాజెక్టు వల్ల పై రాష్ట్రాలకు కూడా ఉపయోగమే ఉంటుంది కానీ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఢిల్లీలో జరిగిన నాలుగు రాష్ట్రాల జలవనరుల ఉన్నతాధికారులు నిపుణుల సలహాలో ముంపు సమస్యపైనే పెద్ద చర్చ జరిగింది.గోదావరిలో 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని హైదరాబాద్ ఐఐటీ కాదు కాదు 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని రూర్కీ ఐఐటి నిపుణలు ఇచ్చిన నివేదికపై ఛత్తీస్ ఘడ్ ఒడిస్సా తెలంగాణా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి.అయితే గోదావరి చరిత్రలో ఇఫ్పటివరకు అత్యధికంగా 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినట్లు జలసంఘం గుర్తుచేసింది. 50 లక్షల క్యూసెక్కుల వరద విషయంలో ఛత్తీస్ ఘర్ 58 లక్షల క్యూసెక్కుల వరద విషయంలో ఒడిస్సా పట్టుబట్టాయి.ఇదే విషయమై అన్నీ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాలపైన జాయింట్ సర్వేకి ఎలాంటి సమస్య లేదని ఏపీ ఉన్నతాధికారులు ప్రకటించారు. పై రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఏపీ ఉన్నతాధికారులు ఎంత క్లారిటి ఇచ్చినా ఏదో అభ్యంతరాన్ని లేవనెత్తుతునే ఉన్నాయి. దాంతో సమస్య సాంకేతికమా ? లేకపోతే రాజకీయమా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.