
ఐపీఎల్ - 11 చివరి దశ కి చేరుకుంది. ఈ రోజు నుంచి ప్లే ఆఫ్ సమరం మొదలవుతుంది. తొలి పోరు మంగళవారం రాత్రి 7గంటలకు ప్రారంభంకానుంది. పాయింట్ల పట్టికలో నంబర్‌వన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నం.2 జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. గెలిచిన జట్టు ఫైనల్ కోసం ముంబయిలోనే ఉంటుంది. ఓడిన జట్టే.. మళ్లీ ముంబయి రావాలన్న కసితో రెండో క్వాలిఫయర్ కోసం కోల్‌కతాకు వెళ్తుంది.