YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టార్గెట్ 100

టార్గెట్ 100

విజయవాడ, అక్టోబరు 10, 
జనసేనకు చాలా టైమ్‌ దొరికింది.. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనుకుని కాస్తా గాబరా పడినా.. అలాంటిదేమీ లేదని అర్థమయ్యాక జనసేనాధిపతి రూటు మారుస్తున్నారట.. టార్గెట్‌ పెంచుకుని పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారట. వైసీపీ ముందస్తుకు వెళ్లదని సంకేతాలు రావడంతో.. జనసేనకు కావాల్సినంత టైమ్‌ దొరికిందని జనసైనికులే చెప్పుకుంటున్నారు. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా.. గ్రౌండ్‌ లెవెల్‌ నుంచి పార్టీని స్ట్రాంగ్‌ చేసుకోవాలనుకుంటున్నారట పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడు జనసేన టార్గెట్ 100 అసెంబ్లీ స్థానాలు. వచ్చే ఎన్నికల్లో వీటిని కైవసం చేసుకోవడానికి..పవన్‌ కల్యాణ్‌ ప్రణాళిక రచిస్తున్నారట.. ఇప్పటికే జనసేనకు బలం పెరిగిందని.. సర్వేలు చెబుతుండటంతో.. మరింత కష్టపడితే..ఇంకా మంచి ఫలితాలు సాధించొచ్చని పవన్‌ భావిస్తున్నారట. అందుకే పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు.. రాష్ట్రస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. టాప్‌ టు బాటమ్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు జనసేనాని..ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షుల నియామకం జరగనుంది. వచ్చే 5 రోజుల్లో నియోజకవర్గాల సమీక్షలపై షెడ్యూల్ విడుదల చెయ్యబోతున్న జనసేన.. క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్స్‌కు ఆహ్వానం పంపింది. అటు జనసేన కౌలురైతు భరోసా యాత్రలను కూడా కంటిన్యూ చేయనున్నారట. ఈ నెలలోనే చిత్తూరు జిల్లా టూర్‌ కూడా ప్లాన్‌ చేశారట.. ఏపీలోనే కాదు.. అటు తెలంగాణ వైపు కూడా దృష్టి పెట్టిన పవర్ స్టార్..అక్కడా పార్టీ విస్తరణకు వ్యూహాలు రచిస్తున్నారట. తెలంగాణలో సైతం.. బహిరంగ సభలు నిర్వహించాలని.. నియోజకవర్గ ఇంచార్జీలు, మండలాధ్యక్షులను నియమించాలని భావిస్తున్నారట.ఎన్నికలకు చాలా టైముంది.. ఈ లోపు కొన్ని సినిమాలు కూడా చేసే వీలుంది. దీంతో.. పార్టీకి ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉండదని పవన్‌ ప్లాన్‌.. మరి ఆయన లెక్కలు ఎన్నికలనాటికి పనికొస్తాయా.. తారుమారవుతాయా అన్నది కాలమే చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related Posts