YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హై ప్రొఫైల్ అధికారులే ఆమె టార్గెట్

హై ప్రొఫైల్  అధికారులే ఆమె టార్గెట్

భువనేశ్వర్, అక్టోబరు 10, 
తన అందంతో, సొగసైన మాటలతో పలువురు రాజకీయ నాయకులను ముగ్గులోకి దింపింది. అనంతరం వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కి దిగి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తున్న నిందితురాలిని భువనేశ్వర్‌  పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. నిందితురానికి భువనేశ్వర్‌లోని సత్య విహార్‌ ప్రాంతానికి చెందిన అర్చన నాగ్ (25)గా పోలీసులు గుర్తించారు. ఆమె దగ్గరి నుంచి ఫోన్లు, రెండు పెన్ డ్రైవ్‌లు, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఐతే హై-ప్రొఫైల్ కస్టమర్ల పేర్లను మాత్రం ఆమె ఇంతవరకు వెల్లడించలేదని సమాచారం. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ సౌమేంద్ర ప్రియదర్శి, డిప్యూటీ ప్రతీక్ సింగ్‌లలో ఎవ్వరూ మీడియాకు తెలుపలేదు. పలువురు సీనియర్ అధికారులు సైతం ఆమె అరెస్టును గోప్యంగా ఉంచడం గమనార్హం. ఈ విషయంపై పోలీసులు నోరు మెదపకపోవడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధార్థ్ దాస్ అనే సీనియర్ లాయర్‌ మాట్లాడుతూ.. ‘పోలీసులు నిందితులను అరెస్టు చేసినప్పుడల్లా, మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతూ.. ఫోటోలకు పోజులు ఇస్తారు. పోలీసధికారులు, రాజకీయ నాయకులతో సహా కొంతమంది ప్రముఖుల పేర్లు హనీ ట్రాప్ కేసులో చక్కర్లు కొడుతున్నందున పోలీసులు కేసు తాలూకు విషయాలను రహస్యంగా ఉంచుతున్నారు. ఆమెను రహస్యంగా కోర్టులో హాజరుపరిచినట్లు’ తెలిపారు.నిందితురానికి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల వంటి సామాజిక మాద్యమాల ద్వారా సంపన్నులు, ఉన్నతాధికారులతో తొలుత స్నేహం చేస్తుంది. తర్వాత మాటలతో ముగ్గులోకి దింపి తన ఇంటికి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా మెలిగి వాటిని రహస్యంగా రికార్డు చేసేది. ఆ తర్వాత వాటి ద్వారా డబ్బు డిమాండ్‌ చేసేంది. అడిగినంత ఇవ్వకపోతే వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో ఉంచుతానని బెదిరింపులకు దిగేది. ఆమెకు బీఎండబ్ల్యూ, ఫోర్డు వంటి ఖరాదైన కంపెనీల కార్లు ఉన్నాయి. భువనేశ్వర్‌లో లగ్జరీ ఫార్మ్‌ హౌస్‌ కూడా ఉంది.ఆమె భర్త కోసం పోలీసుల వెతుకులాట.. హనీ ట్రాప్ గ్యాంగ్‌లో భాగమైన ఆమె భర్త జగబంధు చంద్ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు సమాచారం. ఈ ముఠాలో కొందరు మహిళలు ఉన్నారు. వీరి ద్వారా సోషల్ మీడియాలో హై-ప్రొఫైల్ వ్యక్తులను హనీ ట్రాప్ చేసి, వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు. తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి దోపిడీకి పాల్పడతారు
బ్యాంకు ఖాతాల వివరాలు సేకరణ
తన అందంతో, సొగసైన మాటలతో రాజకీయ నాయకులకే మస్కా కొడుతుంది. ఆ తరువాత అసలు ప్లాన్‌ అమలు చేస్తుంది. వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కి దిగి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తుంది. కొంత కాలంగా రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ మాయలాడిని ఎట్టకేలకు భువనేశ్వర్‌ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. నిందితురానికి భువనేశ్వర్‌లోని సత్య విహార్‌ ప్రాంతానికి చెందిన అర్చన నాగ్ గా గుర్తించారు. ఆమె దగ్గరి నుంచి ఫోన్లు, రెండు పెన్ డ్రైవ్‌లు, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఆమెకు భువనేశ్వర్‌లో ఖరీదైన భవనం ఉంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో సంపన్నులు, ఉన్నతాధికారులతో స్నేహం చేస్తుంది.తర్వాత మాటలతో ముగ్గులోకి దింపి తన నివాస భవనంలోకి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా ఉండి.ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించేది. తర్వాత అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్‌మీడియాలో పెడతానని బెదిరిస్తుంది. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆమె వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బీఎండబ్ల్యూ, ఫోర్డు కార్లున్నాయి. ఓ ఫార్మ్‌ హౌస్‌ కూడా ఉంది.హై-ప్రొఫైల్ కస్టమర్ల పేర్లను మాత్రం ఆమె ఇంతవరకు వెల్లడించలేదు. పలువురు సీనియర్ అధికారులు సైతం ఆమె అరెస్టును గోప్యంగా ఉంచడం చర్చనీయాంశం అయింది. పోలీసులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనీ ట్రాప్ గ్యాంగ్‌లో ఉన్న ఆమె భర్త జగబంధుచంద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు .ఈ ముఠాలో కొందరు మహిళలు ఉన్నారు.అర్చన నాగ్ దాదాపు 20 మంది హై-ప్రొఫైల్ సెక్స్ వర్కర్లను నియమించుకుంది. ఎల్లప్పుడూ సంపన్న కస్టమర్ల కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ సెక్స్ వర్కర్లు తమ సేవలను అందించే ప్రముఖ వ్యక్తులతో ఫోటోగ్రాఫ్‌లు క్లిక్ చేయాలని ఆమె ఆదేశించింది. తర్వాత ఆ ఫొటోలను ఉపయోగించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి భారీగా డబ్బులు వసూలు చేసింది.అర్చన నాగ్‌తో కలిసి పనిచేస్తున్న సెక్స్ వర్కర్ల ఫోటోలు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలను కూడా పోలీసులు బయటపెట్టారు. ఆమెను అరెస్టు చేసిన తర్వాత, అర్చన నాగ్ బ్యాంక్ ఖాతాలు మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి లేఖ రాశారు.రాకెట్‌లో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించడానికి కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ మహిళ భర్త జగబంధు చంద్‌ ఆరోగ్యం బాగోలేదన్న కారణంతో ఇంకా ప్రశ్నించాల్సి ఉండగా అతడికి నోటీసులు జారీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related Posts