
వరుస విజయాలతో కొరటాల శివ మంచి ఊపు మీద ఉన్నాడు. 'భరత్ అనే నేను' చిత్రం తర్వాత దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించే చిత్రంపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందన్నది తాజా సమాచారం. వచ్చే జనవరిలో ఇది సెట్స్ కి వెళుతుందని అంటున్నారు. కొరటాల శివ ఇపుడు వరకు మెగా హీరోలు తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ మెగా కాంబినేషన్ కోసం అభిమానులు అందరు చాలా ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.