
రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా కారు ప్రమాధవశాత్తూ కానిస్టేబుల్ బైక్ ని ఢీకొంది.ఇందులో ఎవరికీ గాయం అవ్వలేదు, కానీ కానిస్టేబుల్ మాత్రం రచ్చ రచ్చ చేసాడు.ఓ దశలో ఆమె జుట్టు పట్టుకుని కొట్టబోగా తాము రక్షించామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనంతరం చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లిన రీవాను జామ్‌నగర్ ఎస్పీ ప్రదీప్ కలుసుకుని స్వయంగా ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అనంతరం పోలీసులు కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు.