YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెజ్లింగ్ స్టార్ నుంచి సీఎం వరకు

రెజ్లింగ్ స్టార్ నుంచి సీఎం వరకు

లక్నో, అక్టోబరు 10, 
దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ప్రముఖ సోషలిస్ట్ నాయకులు రామ్ మనోహర్ లోహియా, సీనియర్ నేత దివంగత రాజ్‌నారాయణ్‌ స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. యూపీ ప్రజలు ప్రేమగా నేతాజీ అని పిలుచుకునేంత పేరును ఆర్జించారు. ఉన్నత రాజకీయ విలువలు, ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలతో సమాజ్‌వాదీ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పారదర్శక పాలనతో రాష్ట్ర అభివృద్ధి కీలక భూమిక పోషించారు. ఆయన మృతితో దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. పదిసార్లు ఎమ్మెల్యేగా.. ఏడుసార్లు ఎంపీగా గెలిచి.. రాజకీయ రణరంగంలో తనకు తిరుగులేదని ములాయం నిరూపించుకున్నారు.దేశ రాజకీయాల్లో రాజకీయ మాంత్రికుడిగా ములాయం సింగ్ యాదవ్ గుర్తింపు పొందారు. 1992లో సమాజవాదీ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన… జాతీయ పార్టీల అజెండాను ప్రాంతీయ పార్టీలు నిర్దేశించగలవంటే ఎవరూ నమ్మలేదు. కానీ నాలుగేళ్లలోనే దానిని సాధ్యం చేసి చూపించారు. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులతో తృతీయ కూటమికి ప్రధాన రూపకర్తగా ఆయన పేరుగాంచారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఈ సోషలిస్ట్‌ నేత విజయవంతమయ్యారు. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కాగా.. బీజేపీ కేంద్రంలో సర్కారును ఏర్పాటు చేసే బలం లేదు. 1996,1998లో వరుసగా హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ సారథ్యంలో తృతీయ కూటమి ప్రభుత్వాల ఏర్పాటు ఆయన కీలకపాత్ర పోషించారు.స్వతహాగా రెజ్లర్‌ అయిన ములాయం సింగ్ యాదవ్ అనతికాలంలోనే రాజకీయాల్లో ప్రముఖ నేతగా, జాతీయ నేతగా ఎదిగారు. ములాయం సింగ్‌ యాదవ్ ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్‌ 22న మూర్తిదేవి-సుఘర్‌సింగ్‌ యాదవ్‌ దంపతులకు జన్మించారు. ఆయన ఆగ్రా యూనివర్సిటీ నుంచి రాజకీయ విజ్ఞానశాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్ యాదవ్‌.. ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు. మూడుసార్లు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యుడిగా 10 సార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. లోక్‌సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా ఉత్తర్ప్రదేశ్‌ను ములాయం అభివృద్ధి పథంలో నడిపించారు.ములాయం రాజకీయ ప్రస్థానం రెజ్లింగ్‌ రింగ్‌ నుంచి ప్రారంభమైంది. 1962లో జరిగిన రెజ్లింగ్‌ మ్యాచ్‌.. ఆయన జీవితాన్ని గొప్ప ములుపు తిప్పింది. జశ్వంత్‌నగర్‌లో జరిగిన రెజ్లింగ్‌ మ్యాచ్‌లో సత్తాచాటిన ములాయం యునైటెడ్‌ సోషలిస్ట్‌ పార్టీ నేత నాథూసింగ్‌ను ఆకర్షించారు. ములాయంను ఆయన యూపీ రాజకీయ యవనికపై పరిచయం చేస్తే.. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించి ములాయం అనతికాలంలోనే జాతీయ నేతగా గుర్తింపు పొందారు. 1967 ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో నాథూసింగ్‌.. ములాయంకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైన ఈ సోషలిస్ట్‌ నేత రాజకీయ ప్రస్థానం.. అప్రతిహతంగా కొనసాగింది. యూపీలో అనేక సంస్కరణలను పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ములాయం మొదటి భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్‌యాదవ్. రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్‌ యాదవ్. ప్రముఖ సోషలిస్ట్ నాయకులు రామ్ మనోహర్ లోహియా, సీనియర్ నేత దివంగత రాజ్‌నారాయణ్‌ స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారు.దేశ రాజకీయాల్లో ప్రతి మలుపును దగ్గరగా పరిశీలించిన కురువృద్ధుడి మరణంతో ఉత్తరప్రదేశ్ సహా దేశమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ములాయం చాలా కాలం పాటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1975లో ఇందిరాగాంధీ అత్యవసర స్థితి విధించినప్పుడు ములాయం 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి.. తన పోరాట పటిమతో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. పదిసార్లు ఎమ్మెల్యేగా.. ఏడుసార్లు ఎంపీగా గెలిచి.. రాజకీయ రణరంగంలో తనకు తిరుగులేదని ములాయం నిరూపించుకున్నారు. ఉత్తర్ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన ఈ రాజకీయ కురువృద్ధుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరిగెత్తించారు.
 

Related Posts