YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దుర్గమ్మకు 6.34 కోట్ల ఆదాయం

దుర్గమ్మకు 6.34 కోట్ల ఆదాయం

విజయవాడ, అక్టోబరు 12, 
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు, లడ్డూ ప్రసాదం, భక్తులు తలనీలాల సమర్పణ ద్వారా రూ.6.34 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.2.48 కోట్లు, దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2.5 కోట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షల ఆదాయం లభించింది. కాగా గత ఏడాది నవరాత్రి ఉత్సవాల సమయంలో రూ.4.08 కోట్లు మాత్రమే సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు రూ.2 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొత్తం 12 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.అటు ద‌స‌రా ఉత్సవాలు ముగిసిన త‌రువాత కూడా పెద్ద సంఖ్యలో భ‌క్తులు అమ్మవారిని ద‌ర్శించుకుంటున్నారు. దీంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ద‌స‌రా ఉత్సవాలు అక్టోబ‌ర్ 5వ తేదీన ముగిసినా 9వ తేదీ ఆదివారం వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగింది. ల‌క్షల సంఖ‌లో భ‌క్తులు త‌ర‌లిరావ‌టంతో పాటుగా భ‌వానీ భ‌క్తులు కూడా పెద్ద ఎత్తున దుర్గమ్మ సన్నిధికి తరలివ‌చ్చారు. దీంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగే అవ‌కాశం కనిపిస్తోంది. గ‌త ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారికి హుండీ ఆదాయం ద్వారా రూ.7.5 కోట్ల ఆదాయం ల‌భించింది

Related Posts