YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గండికోటకు మహర్దశ

గండికోటకు మహర్దశ

కడప, అక్టోబరు 13, 
కడప జిల్లాలోని గండికోటకు మహార్ధశ రాబోతోంది. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు, హోటళ్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. గండికోటను ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు పరిశీలించారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట పర్యాటక ప్రాంతాన్ని ప్రముఖ ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రతినిధులు సందర్శించారు. గండికోటలో నూతనంగా ఏర్పాటు చేయబోయే హోటల్ నిర్మాణానికి సంబంధించి భూమిని ఒబెరాయ్ హోటల్ సీఈఓ అర్జున్ సింగ్ ఒబెరాయ్, ఆయన బృందం పరిశీలించారు. గండికోటను పరిశీలించేందుకు వచ్చిన ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు సీఈఓ అర్జున్ సింగ్ ఒబెరాయ్, రాజమాన్ శంకర్, వినోద్ గోస్వామి, సమూర్ నాయర్, మహినర్ తుఖర్ లకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి గండికోటను పరిశీలించారు. హోటల్స్ తర్వగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని హోటల్స్‌లో 7 స్టార్ సౌకర్యాలతో విల్లా మోడల్ నిర్మాణం చేయనున్నామని తెలిపింది ఒబెరాయ్ గ్రూప్. గండికోటను పర్యాటక రంగపరంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.ఇదిలా ఉండగా ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధిని విస్తృతపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒబెరాయ్ హోటల్ తో ఒప్పందం కుర్చుకుంది. ఇప్పటికే ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవో రాజారామన్ శంకర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఒబెరాయ్ హోటల్ గ్రూప్ ప్రణాళికల్ని ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. విశాఖపట్నం, తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హార్సిలీ హిల్స్‌లలో హోటల్స్ ఏర్పాటుకు ఒబెరాయ్ గ్రూప్ ఆసక్తి చూపించింది. రాష్ట్రంలో రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రత్యక్షంగా 1,500 మందికి పరోక్షంగా 11,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది ఒబెరాయ్ గ్రూప్.గండికోట ప్రాకారంలోని కొంత భాగం వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్లు ఉంటుంది. కోట ప్రాకారం ఎర్రటి నున్నని రాళ్లతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది. కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. ఆనాటి శిధిల శిల్పాలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచాయి.

Related Posts