YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

భారత రాజ్యాంగ పరిరక్షణే కర్తవ్యం..

భారత రాజ్యాంగ పరిరక్షణే కర్తవ్యం..

అభివృద్ధి మంత్రం నాణానికి ఒకవైపు మాత్రమే.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి  డెబ్బై సంవత్సరాలపైబడిన తరుణంలో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తోంది (చూస్తున్నాం). భారీ ప్రాజెక్టులు, పరిశ్రమలు నిర్మించుకున్నాం. విద్యుచ్ఛక్తిలో నిలదొక్కుకున్నాం. పాలనా సౌలభ్యం కోసం అధి కార వికేంధ్రీకరణ అంచెలంచెలుగా జరుగుతూనే ఉంది. వ్యవసాయం, విద్య, వైద్యం, ప్రజల జీవన ప్రమాణం, ఆయుప్రాయాలు మెరుగు పరుచబడుచున్నవి. యువత ఉపాధి కోసం నిధులు ఖర్చుచేస్తున్నాం. ఆకాశ హార్మ్యాలు నిర్మించుకుంటున్నాం. పట్టణాలు మహానగరాలవుతున్నాయి. నగరాల్లో మెట్రోల ప్రయాణా లు చూస్తున్నాం. ఒకేసారి స్వదేశీ పరిజ్ఞానంతో వందకు పైగా ఉపగ్రహాలను విజయ వంతంగా ప్రయోగించుకున్నాం. స్వాతంత్య్రం నాటి జనాభా 35 కోట్లు, నేడు 135 కోట్లకు పెరిగిందని, ఇలా ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల సాక్షిగా త్రం అభివృద్ధి మంత్రం జపిస్తున్నప్పటికి ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.

స్వాతంత్య్రానికి రాకముందు వేలయేండ్ల నాడే ఈదేశం మీద అనేక దండయాత్రల మూలంగా ఇక్కడి ప్రజలు తరతరాలుగా అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. రాజరికాల నుంచి మత పాలకులు, బ్రిటీష్ వారు ఆ తర్వాత 1857లో భారతదేశంలోని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మీరట్‌లో ఓ సిపాయి దళం సైనికాధికారుల ఆదేశాల్ని ధిక్కరించింది. అలా మొద లైన తిరుగుబాటు ప్రథమ స్వాతంత్య్ర సమ రంగా సంస్థానాల అధినేతల్లో స్వాతంత్య్ర జ్వాలలు నింపింది. ఆ ఉద్యమం అంచెలంచెలుగా, వివిధ దశలల్లో అనేక రూపాల్లో మితవాదులు, అతి వాదులు, విప్లవపంథా, గాంధేయవాదం ఫలితంగా పరాయిపాలన అంతమై 1947 ఆగస్టు 15న స్వా తంత్య్రం సిద్ధించింది. బ్రిటిష్ వారు మనదేశంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం వాటా 23 శాతం, వారు ఇక్కడి నుంచి వేళ్ళే టప్పుడు అది 4 శాతానికి పడిపోయింది. భారతదేశం 26 జనవరి 1950 నుంచి ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకొని ప్రజాపాలన వచ్చిన నాటికే... దేశంలో ఎన్నో కులాలు, మతాలు, జాతులు, మరెన్నో ఆర్థిక అసమానతలు, వీటిని అధిగమించి నాటి జాతీయ నాయకులంతా సర్వమత, సమానత్వాన్ని ఆకాం క్షించారు.  ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు, ఉండేలా రాజ్యాం గంలో స్పష్టంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నేతృత్వంలో సమిష్టిగా నిర్ధారించుకొని రాసుకోవడం జరిగింది.

ప్రపంచ దేశాల్లో అతిగొప్ప, ఉత్తమ పరిపూర్ణ ప్రజాస్వామ్య దేశంగా వెలుగొం దుచున్నది. కానీ సామాజిక, ఆర్థిక జీవనంలో ఈ సమానత్వాన్ని సాధించలేక పోతు న్నాం. నాడు స్వేచ్ఛ కోసం ఉద్యమాలు, నేడు నాది అనే స్వార్థం పెరిగి పోయింది. నాటి స్వాతంత్య్ర పోరాటంలో జనాలు తమ ఆస్తులు, ఒంటి మీది ఆభరణాలు ఒలిచి ఇచ్చినారు. నేడు తరతరాలు తిన్నా తరగని సంపదను సంపాదించి విదేశాల్లో దాచుకుంటున్నారు. నేడు బాధ్యతలను గాలికి వదిలేసి, హక్కుల కోసం ఉద్య మిస్తున్నారు. నాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, త్యాగాలను ప్రజలు, పాలకులు మరిచిపోతున్నారు. ఆనాటి జాతీయోద్యమ నాయకులు  మన దేశానికి, ప్రజలకు మేలు జరిగేలా సమసమాజ స్థాపనార్ధం చేసిన త్యాగాలను నేటితరం నేతలు విస్మరించి తాను మాత్రమే బాగుపడాలని, ప్రభుత్వ నిధులు తరగి పోయినాసరే, తన ఖజానాలో జమ కావాలనే స్వార్థం రోజురోజుకూ రెట్టింపవుతోంది.

నాడు స్వాతంత్య్రోద్యమానికి ప్రశ్నించడమే ప్రధానం. ఒక్కొక్క ప్రశ్న వందల తూటాలతో సమానం. పరదేశీయులైనా స్వీకరించారు. నేడు పౌరులు ప్రశ్నించడాన్ని మరిచిపోతున్నవారు కొందరైతే ప్రజల పక్షాన ప్రశ్నించిన ప్రజా సంఘాల వారిని పాలకులు భయంతో గొంతులు నొక్కేస్తూ, ప్రశ్నను, ప్రశ్నించేవారిని చంపేస్తున్నారు. స్వాతంత్య్ర సమయంలో సామాన్య ప్రజలు కూడా ఆకలితో కడుపు చేతపట్టుకొనైనా దేశం కోసం ఆలోచించారు.  నేడు ‘మనం’ అనే భావన మరుగున పడిపోతుంది. ‘నాది’ ‘నా’ అన్న స్వార్థం బలపడుతుంది. ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికలను ప్రజలు, పాలకులు తేలిక భావం తో, చులకనగా తీసుకొంటు న్నారు. 50-60% శాతానికి పోలింగ్ తగ్గిపోతుంది. దాని వలన 25-30 శాతం ఓట్లు పొందిన పార్టీలు, రాజకీయాలు చేస్తూ, పాలకులుగా చెలా మణి అవుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లుపడే పథకా లకే మొగ్గుచూపుతున్నారు. ఇలా దేశంలో భక్తి మార్గం లేదా వ్యక్తి ఆరాధన తారా స్థాయికి చేరింది. ప్రపంచంలో ఎక్కడ లేనంత ఎక్కువ వ్యక్తి, భక్తి ఆరాధన మన దేశంలో ఉంది. అది నియంతృత్వాన్ని పెంచి పోషిస్తోంది. రాజ్యాంగంలో మనం రాసుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సౌభ్రాతృత్వం నానాటికీ క్షీణిస్తున్నాయి.

స్వేచ్ఛను సమానత్వం నుంచి వేరు చేయలేము. సమానత్వాన్ని స్వేచ్ఛనుంచి దూరం చేయలేము. అలాగని స్వేచ్ఛను, సమానత్వాన్ని, సోదరభావం నుంచి వేరు చేయలేము. ఇవి ఏవీ లేకుండా సహజత్వం సమకూరదని నాడే డా॥ బి.ఆర్. అంబేద్కర్ విడమరిచి చెప్పారని మరువరాదు. దేశంలో చెలామణిలో ఉన్న డబ్బును రద్దుచేసి నల్లధనాన్ని నిర్మూలి స్తామని భీరాలు పలికిన పాలకుల అధికారంలోకి వచ్చిన తరువాత మరిచారు. నేటికి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఏళ్లకు పైగా, రాజ్యాంగం రాసుకుని ప్రజాపాలన అమలై డెబ్బై ఏళ్లకు చేరువైన వేళ అభివృద్ధి, సంక్షేమంలో పున: సమీక్ష చేసుకుంటే ? మానవాళికి అతి ప్రధానమైన కూడు, గుడ్డ, నీడ అవసరాలను తీర్చలేదనేది నగ్నసత్యం. దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగ వేడుకలు 68వ సారి జరుపుకుంటున్న సందర్భంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పరిరక్షిస్తూ దేశాన్ని ఆధునీకరించే అద్భుతశక్తిగా పరిరక్షించబడాలన్న మహా ఆశయానికి పాలకులు, ప్రజలు కంకణ బద్ధులవాలి.

Related Posts