YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ కిట్ల పథకానికి తెలంగాణ ప్రభుత్వ ఎక్సెల్లెన్సీ అవార్డు సంతోషం వ్యక్తం చేసిన వైద్య మంత్రి లక్ష్మారెడ్డి

కేసీఆర్ కిట్ల పథకానికి తెలంగాణ ప్రభుత్వ ఎక్సెల్లెన్సీ అవార్డు  సంతోషం వ్యక్తం చేసిన వైద్య మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణలో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్న ప్రభుత్వ పథకాల్లో ఉత్తమంగా ఎంపికైంది కేసీఆర్ కిట్ల పథకం. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా సంబంధిత శాఖ అధికారులు అందుకున్నారు. మరోవైపు ఈ అవార్డు రావడం పట్ల వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అవార్డులు దక్కడమే కాకుండ, దేశం, రాష్ట్రాలను ఆకర్షిస్తున్నదని మంత్రి అన్నారు. అనేకమంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు సీఎం లు సైతం అభినందించారని అన్నారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖ కు కూడా అవార్డులు వచ్చాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం ప్రకారం చేయడం,  సీఎం గారి ఆలోచనల మేరకు నడచుకోవడం వల్ల సాధ్యం అయిందన్నారు. అందు వల్ల మంత్రి లక్ష్మారెడ్డి సీఎం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఐఎఎస్  ఉన్నతాధికారులు, డాక్టర్లు, నర్సులు సిబ్బంది మంచి పనితీరు వల్ల సాధ్యం అయిందన్నారు. ఈ అవార్డు తమ బాధ్యతను పెంచిందని, మరింత ష్ఠంగా కేసీఆర్ కిట్ల పథకాన్ని అమలు చేసి మరింత ఎక్కువ ప్రజాభిమానాన్ని చూరగొంటామని మంత్రి చెప్పారు.

జూన్ 3వ తేదీ 2017 న పేట్ల బురుజు హాస్పిటల్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమైంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు తెలంగాణ లో అమలు అవుతుండగా, సీఎం కేసీఆర్ గారి పెరు మీదే ప్రారంభమైన ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. అంతేగాక గర్భిణీల ఆత్మగౌరవాన్ని పెంపొందించే రీతిలో దీన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. 

గర్భిణీస్త్రీ కి సమాజంలో గౌరవం పెంచే విధంగా మరియు అన్ని దశలలో గర్భిణీస్త్రీకి ప్రభుత్వం అండగా ఉండి ఒక ఆరోగ్యమైన సమాజం కొరుకు ఒక బలమైన పునాది ఏర్పరచే విధంగా రూపొందించదానికి వీలుగా  ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పధంతో ఆలోచించి కేసీఆర్ కిట్  పథకం  ప్ర‌క‌టించారు.

Related Posts