YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యేలపై కేసులు... మాములే

ఎమ్మెల్యేలపై కేసులు... మాములే

హైదరాబాద్, అక్టోబరు 14, 
తమ పార్టీ నేతలపై నమోదైన కేసులను ఎత్తి వేస్తూ గతంలో జారీ చేసిన జీవోలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపింది. దీంతో కేసుల ఎత్తివేతపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసి వేసింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ఇష్టానుసారం ఉపసంహరించుకుంటే కుదరదని, అది కోర్టు ధిక్కరణే అవుతుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే కనుక రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉపసంహరణకు పెండింగులో ఉన్న అన్ని కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరించింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవో ఇవ్వగా, దానిని సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.  సామినేని ఉదయభానుతోపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజిని, మల్లాది విష్ణు, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, జక్కంపూడి రాజా, ఎంవీ ప్రతాప్ అప్పారావు, టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు సీహెచ్ ద్వారకారెడ్డి, విరూపాక్ష‌ి జయచంద్రారెడ్డిపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. సీఎం జగన్‌పై ఉన్న కేసులను కూడా ఎత్తివేయడం వివాదాస్పదమయింది. అదే సమయంలో  16 సెప్టెంబరు 2020 నుంచి 25 ఆగస్టు 2021 మధ్య రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చారనే వివరాలను పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది.  చెవుల కృష్ణాంజనేయులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో ఏపీ ప్రభుత్వం కేసుల ఎత్తివేతలకు సరైన కారణాలను వివరించలేకపోయింది. ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేయాలంటే హైకోర్టు అనుమతి తప్పని సరి అయినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది.  కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హోంశాఖను గత విచారణలో హైకోర్టు ఆదేశించింది.  హైకోర్టు అనుమతి లేకుండా మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత కుదరదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తు చేసింది. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే.. తమ పార్టీ నేతలపై ఉన్న కేసులను ఎత్తి వేయడానికి ప్రాదాన్యం ఇస్తూ ఉంటాయి.అయితే  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పోలీస్ స్టేషన్‌ పై దాడులు చేసిన కేసులు, తుని అల్లర్ల కేసులను కూడా ఉపసంహరించుకుంది. అదే సమయలో పార్టీ నాయకులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నా వాటిని ఉపసంహరించుకునేందుకు జీవోలు జారీ చేసింది. ఈ కారణంగానే కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. చివరికి ఆ జీవోలన్నింటినీ వెనక్కి తీసుకోవాల్సి చ్చింది.

Related Posts