YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చాపకింద నీరులాగా కోదండరామ్

చాపకింద నీరులాగా కోదండరామ్

ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఉద్యమంలో కీలక పాత్రను నిర్వహిస్తునే.. మలిదశ ఉద్యమంలో నాడు తెలంగాణ వాదాన్ని కోదండరాం బలాన్ని వినిపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ జన సమితిని పార్టీని స్థాపించారన్నది అ పార్టీ నేతల మాట. ఏప్రిల్ 29న జరిగిన టీజేఏస్ ఆవిర్భావ సభ నుండి నేటి వరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో సర్వే చేయించారని తెలుస్తొంది. కాగా, ఈ సర్వేలో ఇంటలిజెన్స్ ఐదు ప్రశ్నలతో టీజేఏస్ పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సేకరించినట్లు సమాచారం. ఇందుకుగానూ ప్రతి నియోజకవర్గంలోని 1000 మంది అభిప్రాయాలను సర్వేలో సేకరించార ని.. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే టీజేఏస్ ఒంటరిగా బరిలోకి దిగితేనే, టీజేఏస్‌కి 26 నుంచి 35 సీట్లలో విజయం సాదిస్తారని వార్తలు తెలంగాణ అంతటా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బలైమెన పార్టిగా టీజేఎస్ ఎదగాలంటే...అ పార్టీ నిర్మాణం, అనుబంధ కమిటీల నిర్మాణం, బూత్ కమిటీల నిర్మాణంతో కొంత జరుగవచ్చు. దీనికి తోడు గత ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకి ఉద్యమ నేతగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఇచ్చిన హమీలు, నిరుద్యోగులకు ఇచ్చిన ఒక లక్ష ఉద్యోగ ఖాళీల భర్తీ, కేజీ టూ పీజి ఉచిత నిర్భంద విద్య, డబుల్ బేడ్ రూము, జర్నలిస్టుల హమీ, కౌలు రైతులు, ఖమ్మంలో రైతుల చేతులకు భేడిలు, నేరేళ్ల, ఇసుక మాపియా, మిషన్ కాకతీ, మిషన్ భగిరథ, చేరువుల పుడిక తీత వంటి పథకాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లగలగాలి.హమీలు ప్రజల్లోకి తీసుకెళ్లె సవుయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ప్రతి అడ్డంకిని ఇబ్బందులని, సవుస్యలని ప్రజల వద్దకు చేర్చేందుకు గట్టిగా సద్దపడాలి. అందుకు జన సమితి ప్రతి కార్యకర్త ఉద్యమంలో మాదిరిగా ఓ సైనికుడిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెస్తున్న తప్పులు...విచ్చలవిడి ఖర్చులను ఎక్కడికక్కడా ప్రజా క్షేత్రంలో నిలదీస్తే...టీ జేఎస్ అనుకున్న లక్ష్యాలకంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి. దీంతో ఇంటలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు కొంత ప్రభుత్వానికి అనుకులంగా ఉంటోందన్న వాదన కుడా ఉన్నాయి. ఎది ఎవైునప్పటికి...ఉద్యమంలో తన పాత్రను అద్వితీయంగా నిర్వహిస్తూ...తెలంగాణ ప్రజలని ఎకం చేసిందన్న చరిత్ర తెలంగాణ మెదావులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులలో బలంగా ఉంది.

Related Posts