య్యారు.హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలలో ప్రధాన పోటీ ఎప్పటినుంచో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. అయితే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హిమాచల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్ ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కాపాడుకోగలదా, లేకుంటే కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
షెడ్యూల్ వివరాలు:
☛ ఎన్నికల నోటిఫికేషన్ : అక్టోబర్ 17
☛ నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 25
☛ నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 27
☛ నామినేషన్ల ఉపసంహరణ : అక్టోబర్ 29
☛ పోలింగ్ : నవంబర్ 12
☛ ఫలితాలు : డిసెంబర్ 8
☛ మొత్తం నియోజకవర్గాలు : 68
☛ మొత్తం ఓటర్ల సంఖ్య : 55,07,261 ఓటర్లు
☛ పురుషులు – 27,80,208
☛ మహిళలు – 27,27,016
☛ మొదటిసారి ఓటర్లు – 1,86,681
☛ 80 ఏళ్లపైబడిన ఓటర్లు – 1,22,087