YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవినాష్ చుట్టూ ఉచ్చు..?

అవినాష్ చుట్టూ ఉచ్చు..?

కడప, అక్టోబరు 15, 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా నడుస్తోంది. అయితే ఎప్పడికప్పుడు సీబీఐ హడావుడి పెరిగిన ప్రతి సందర్భంలోనూ సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.తాజాగా వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు ప్రాణ భయం ఉందంటూ మీడియా ముందుకు రావడమే కాకుండా, తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా  తాను చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలని ప్రకటిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా దస్తగిరి తనకు ప్రాణ హాని జరిగితే సిఎం జగన్ దే బాధ్యత అని చెప్పాడాన్ని బట్టి ఈ కేసులో   సిఎం పాత్ర ఉందని అనుమానించాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.అయితే వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతల పై కేసు నమోదు చేయడంలో  దస్తగిరి వాగ్మూలం కీలకం కావడంతో అతనికి రక్షణ కల్పించాలని  తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. సుప్రీం కోర్టు లో వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్ల విషయంలో వెలువడుతున్న తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి.  వివేకా కేసులో జైల్లో ఉన్న నిందితులకు   బైయిల్ ఇచ్చే విషయంలో కోర్టులు సుముఖంగా లేవు.  వివేకా హత్య కేసులో సీబీఐ కి ఇటీవల షర్మిల వాంగ్మూలం  . దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న నేతల ప్రమేయాన్ని షర్మిల సీబీ ఐ కి స్టేట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమని భావించాల్సి వస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related Posts