YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటర్ల రిజిస్ట్రేషన్ తోనే సిటిజన్ రిజస్టర్

ఓటర్ల రిజిస్ట్రేషన్ తోనే సిటిజన్ రిజస్టర్

న్యూఢిల్లీ, అక్టోబరు 15, 
కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టి వినూత్న కార్య‌క్ర‌మం కొద్దిగా ఇలానే ఉంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి గ‌నుక ఓట‌ర్ల వివ‌రాలు అవ‌స‌ర‌మే. కానీ వారి పేర్లు, చిరు నామాతోనే కాదు వారి ద‌గ్గ‌రున్న స‌మ‌స్త కార్డుల వివ‌రాల‌తో స‌హా పేర్లు త‌నముందు ఉండాల‌ని జాతీయ‌ స్థాయిలో రిజిస్ట‌ర్ కావాల‌ని కొత్త ఆలోచ‌న చేసారు. పైగా దానికి చ‌క్క‌గా అఖిల భార‌త డేటా బేస్ అంటూ సూటేసిన పేరొక‌టి పెట్టారు. రిజిస్ట‌ర్‌లో ప్ర‌తీ పౌరుడి పుట్టిన‌, మ‌ర‌ణించిన స‌ర్టిఫికెట్ వివ‌రాలూ ఉంటాయి. అంచేత ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్ల‌లేరు, త‌ప్పించుకోలేరు. అన్నీ శ్రీ‌ప్ర‌భుత చేతుల్లోనే ఉంటారు. ముందు అడుగుగా జాతీయ‌స్థాయిలో సిటిజెన్స్ రిజిస్ట‌ర్ (ఎన్ ఆర్ సి) సంబంధించి కేంద్ర హోం శాఖ డేటాబేస్ త‌యారు చేయ‌డానికి ఒక క్యాబినెట్ నోట్, ఒక బిల్లు ఆమోదించేలా ఈ శాఖ చేయ‌నున్న‌ట్టు తెలియ జేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇటువంటి డేటాబేస్ ప్రాంతీయ రిజిస్టార్ల స‌హాయంతో నియంత్రిస్తున్న‌ది. ఇక త్వ‌ర‌లో ఇదంతా కేంద్రం ప‌రిధిలోకి వెళ్ల‌నుంది. ఓట‌ర్ ఐడితో ఆధార్ లింక్ చేయ‌డ‌మ‌న్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం చెబుతున్న‌ది ప్ర‌జ‌లు అంత సీరియ‌స్‌గా తీసుకోలేదు. కానీ ఇక చాలా సీరియ‌స్‌గా తీసుకోవాల్సివ‌స్తుంది. జ‌నాభా లెక్క‌లు, ఓట‌ర్ల జాబితాతో పాటు ఈ రిజిస్ట్రేష‌న్‌ను ప్ర‌భుత్వం స‌మ‌న్వయం చేయ‌ద‌ల‌చింది. అన్ని రాష్ట్రాల రిజిస్ట్రార్లూ  భార‌త రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ డేటా పంచుకుంటారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మార్పులు చేర్పులూ చేప‌డ‌తూంటారు. ముఖ్యంగా ఆధార్‌, లైసెన్స్‌లు, రేష‌న్‌కార్డులు, ఓట‌ర్ కార్డుల వివ‌రాల విష‌యాల్లో ఈ మార్పులు చేర్పు లు చేప‌డ‌తారు. ఈ స‌మాచారం అంతా జాతీయ రిజిస్ట్రార్‌కు అంద‌జేస్తారు. దీనికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వ‌చ్చి ఆశ్ర‌యం పొందుతున్న‌వారి వివ‌రాలు చ‌ట్ట‌ర‌హిత‌మ‌ని జాతీయ జ‌నాభా రిజిస్ట‌ర్ పేర్కొన్నారు. ఈ ఎన్ఆర్సిని మొద‌టి సారిగా అస్సాంలో ఆరంభించారు. ఇపుడు జాతీయ‌ స్థాయిలో ఆరంభించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తున్నారు. దీనికి తోడు సిటిజ‌న్‌షిప్ అమెండ్మంట్ చ‌ట్టాన్ని కూడా అమ‌లు చేయాలన్న ఆలోచ‌న లో ఉంది. దీన్ని గురించి జాతీయ‌స్థాయిలో మూడేళ్ల క్రితం వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది. విదేశాల నుంచి వ‌చ్చి ఉండేవారి పౌర‌స‌త్వ విష‌యంలో వారు 2015కి ముందు వ‌చ్చిన‌వారికే పౌర‌ స‌త్వం క‌ల్పించ‌డం జ‌రిగింది. అయితే వారు ముస్లింలు కాకుంటే ఎన్ ఆర్‌సి ప్ర‌క్రియ మైనారిటీల అంశంగా తీసుకుని చేయ‌బ‌డింది.

Related Posts