విజయవాడ
ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులు నమోదయింది. ముంపు గురికాబోయే ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు.