అమరావతి
మూడు రాజధానులు వద్దు అమరావతి నే రాజధానిగా ప్రకటించాలని అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవద్దని డీజీపి రాజేంధ్రనాద్ రెడ్డి అన్నారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారితో అయా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్చించారని అయన వెల్లడించారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడా తీవ్ర సమస్యలు ఎదురుకాలేదని అన్నారు. ఎక్కడైనా అలా జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. పాదయాత్ర ఇప్పటి వరకు ప్రశాంతంగానే సాగిందని, అదనపు బందోబస్తు కూడా కల్పించామని అన్నారు.