YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్

ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటి వరకు 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇప్పటికే కోల్ కతా, నేపాల్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నాడ‌ని.. దీనికి సంబంధించి ప్ర‌త్యేక‌ శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. అలాగే.. సాయి పల్లవి మరోసారి మెడికల్ స్టూడెంట్‌గా ఈ సినిమాలో కనిపించనుంది. ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌కు, మెడికల్ స్టూడెంట్‌కు మధ్య ప్రేమ ఎలా చిగురించింది.. అది ఎలాంటి తీరాల‌కు చేరింద‌నేదే ఈ సినిమాలోని కీల‌కాంశం. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది

Related Posts