హెచ్‌ఐవీ (ఎయిడ్స్) జిల్లాపై ప్రభావం చూపుతుంది. తగిన నియంత్రణ, అవగాహన లేకపోవడం తో పరిస్థితి చేయి దాటులోంది. పలువురు తమకు తెలియకుండానే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక సమస్యల సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం వ్యాధి నిర్మూలన కోసం చేపడుతున్న కార్య క్రమాలు ఉపయోగం లేకుండా పోతు న్నాయి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్(నాకో) సంస్థ నివేదిక ప్రకారం జిల్లా జనాభాలో 2.1 శాతం మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు గణాం కాలు చెబుతున్నాయి. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ వహించకపోవడంతో కొంతకాలం నుంచి వ్యాధిగ్రస్థుల సంఖ్య జిల్లాలో పెరిగినట్లు తెలుస్తోంది. ఎయిడ్స్ వ్యాధితో ఏటా మర ణిస్తున్నవారి సంఖ్య వందల్లో ఉంది.
జిల్లాలో ఎయిడ్స్ వ్యాప్తికి అనేక కారణా లున్నాయి. సురక్షితం కాని లైంగిక పద్ధతులు, పరీక్షించని రక్తాన్ని స్వీకరించడం, ఒకరు ఉపయోగించిన సూదులను(నీడిల్స్) మరొ కరికి ఉపయోగించడం, తల్లి నుంచి బిడ్డకు అనే నాలుగు ప్రధాన కారణాలతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జిల్లాలో జాతీయ రహ దారులపై, తీర ప్రాంతాల్లో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువ మంది ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. లారీ డ్రైవర్లు విధి నిర్వహణలో ఉంటూ ఇంటికి ఎక్కువ కాలం దూరంగా ఉంటారు. మరికొందరు జాతీయ రహదారు లపై ఉండే సెక్స్ వర్కర్లతో కలుస్తుండడం ఈ వ్యాధి వస్తుందని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
జిల్లాలో 1998 నుంచి హెచ్‌ఐవీపై పలు అవగా హన సదస్సులు, ఈ వ్యాధిగ్రస్థులను గుర్తించ డం, కౌన్సెలింగ్ వరకు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేపడుతుంది. జిల్లాలో ఎంత మంది హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులు ఉన్నారనే విషయమై ఎవరికి స్పష్ట మైన సమాచారం లేదని పలువురు వైద్య అధికారులే చెబుతున్నారు. అందుకు కారణం స్వచ్ఛ ందంగా వ్యక్తి బయటకు వచ్చి హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటే ఈ విధంగా బయటపడ్డ వారి సంఖ్య మాత్రమే అధికారికంగా హెచ్‌ఐవీ పాజిటివ్ జాబి తాలోకి చేరుతుంది. ఎక్కువ శాతం మంది వారు నివాసం ఉండే ప్రాంతాల్లో తెలియ కుండా ఇతర జిల్లాల్లో వైద్యం పొందుతూ ఉంటారు. ప్రభుత్వ యాంటీరెట్రోవైరల్ థెరఫి (ఏఆర్‌టీ) కేంద్రాలలో పలు పీహెచ్‌సీలలో 17565 వ్యాధిగ్రస్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా మరో 13063 మంది బయట వాళ్లు గా గుర్తింపు పొందారు. ప్రైవేటు ఆసు పత్రిలో కూడా పెద్ద సంఖ్యలో చికిత్స పొం దుతున్నారు. వ్యాధిగ్రస్థుల సంఖ్యలో రెండు రాష్ట్రాలలో కలిపి నెల్లూరు జిల్లా 22వ స్థానం లో ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
హెచ్‌ఐవీ ఎయిడ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏటా జిల్లాలో కోటి రూపాయలు వెచ్చిస్తోంది. ఎనిమిది స్వచ్చంధ సంస్ధల ద్వారా వ్యాధిపై ప్రచారం నిర్వహించి వ్యాధి నియంత్రణకు వైద్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అనుకున్న లక్ష్యం నెరవేరడంలేదు. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియ ంత్రణ ఎయిడ్స్(లెప్రసీ) విభాగం ఆధ్వర్యలో హెచ్‌ఐవీ ఎయిడ్స్ నివారణకు జిల్లాలో ఏడు హెచ్‌ఐవీ కౌన్సెలింగ్, పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి. శిక్షణ పొందిన కౌన్సె లర్లు హెచ్‌ఐవీ పరీక్షలకు ముందు, తరువాత సలహాలు సూచనలిస్తారు. సుఖవ్యాధులు ఉన్న వారిలో 10 శాతం మందికి హెచ్‌ఐవీసోకే అవ కాశం ఉన్నందున దీని నివారణకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కావలి, గూడూరు ఏరియా ఆసుపత్రులలో సుఖ వ్యాధులు చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వ్యాధి గ్రస్థులకు ఉచితంగా మందులు అందిం చేందుకు పెద్దాసుపత్రిలో యాంటి రిట్రోవైరస్ ధెరఫి(ఏఆర్‌టీ) సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా కావలి, గూడూరు ఏఆర్‌టీ సెంటర్లు పని చేస్తున్నాయి.