సిమ్లా, అక్టోబరు 19,
హిమాచల్ ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ 46 మందితో కూడిన క్యాండిడేట్స్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దింపనుంది. చిన్న రాష్ట్రమే అయినా ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం 40 ఏళ్లుగా కొనసాగుతున్నందున ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ లో అక్టోబర్ 17నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా అధికారులు షెడ్యూల్ లో ప్రకటించారు. అక్టోబర్ 25 నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 27నామినేషన్ల ఉపసంహరణ, 29 పోలింగ్, నవంబర్ 12ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12 న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8 తో పూర్తి కానుంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 35 స్థానాలు అవసరం. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 43, కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ.. అధికారం నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగానే కసరత్తులు చేస్తోంది. పంజాబ్‌లో తిరుగులేని విజయంతో మంచి జోరుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోరు నెలకొంది. 33 శాతంగా ఉన్న రాజ్‌పుత్‌లు, 18 శాతమున్న బ్రాహ్మణులే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. 25% ఉన్న దళిత, 14 శాతమున్న ఓబీసీ ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. అలా రెండు పార్టీలూ చెరో ఐదేళ్లు అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి. గతేడాది మరణించిన కాంగ్రెస్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుటుంబం, బీజేపీకి చెందిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ కుటుంబం కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలపై పట్టు చూపిస్తున్నాయి.