న్యూఢిల్లీ
కాంగ్రెస్ పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా మప్పన్న మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు 7వేలకు పైగా ఓట్లు(7,897 ఓట్లు) పోల్ కాగా అయన ప్రత్యర్ధి శశి థరూర్ కు పది శాతం ఓట్లు(1072 దాకా) పోలయ్యాయి. చెల్లని ఓట్లు 416. దీంతో 6,822 ఓట్ల భారీ మెజార్టీతో ఖర్గే గెలుపొందినట్లు సమాచారం. సుమారు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు, అదీ గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కావడం విశేషం. 80 ఏళ్ల వయసున్న మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక ఖర్గే విజయంపై మరో అభ్యర్థి శశిథరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ప్రధాని పీవీ తర్వాత దక్షిణాది నుంచి అధ్యక్ష పదవికి ఎన్నికైన ఖర్గేనే.